బెల్లి లలిత హత్యలో రాజకీయ నేతలు, నయీం 18 ముక్కలు చేశాడు: సోదరి
హైదరాబాద్: తన సోదరిని గ్యాంగ్ స్టర్ నయీం వర్గమే హత్య చేసిందని, ఈ హత్యలో రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని బెల్లి లలిత సోదరి కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె గురువారం నాడు ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడారు. తమ కుటుంబంలో బెల్లి లలిత కాకుండా మరో నలుగుర్ని నయీం చంపేశాడన్నారు.
నయీం సమాంతర ప్రభుత్వం, మాజీ మంత్రి హెల్ప్ వెనుక..?, 2 సంచుల్లో బంగారం!
ఈ హత్యలను పోలీసులు పట్టించుకోలేదన్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం ఉందని ఆరోపించారు. తన అక్క బెల్లి లలిత హత్యతో తమ కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయిందన్నారు. తన బావ, తమ్ముడు సహా హత్య చేశారన్నారు.

బెల్లి లలితతో సహా తాము ఐదుగురు అక్కా చెల్లెళ్లం అన్నారు. లలితక్కకు ఇద్దరు పిల్లలు అని, చెల్లెలికి ఓ కొడుకు, అక్కకు ఓ కొడుకు ఉన్నారన్నారు. తమ వారిని నమ్మించి, తీసుకెళ్లి ముక్కలు ముక్కలు నరికేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
తన సోదరి బెల్లి లలితను పద్దెనిమిది ముక్కలు చేసి ఆ ముక్కలను ఎక్కడెక్కడో విసిరేశారన్నారు. అక్కకు పుట్టు మచ్చలు ఉన్నాయని, వాటి ఆధారంగా తాము గుర్తు పట్టామన్నారు. అప్పటి దాకా ఆమె ఎక్కడికి వెళ్లిందోననే అర్థం కాలేదన్నారు.
కేసీఆర్ దగ్గరివారు టార్గెట్: వీరినే ముక్కలు చేసిన నయీం (పిక్చర్స్)
నయీం చనిపోయినందుకు సంతోషంగానే ఉందని, ఆ సంతోషం కొద్దిగే అన్నారు. ఇంకా అతని అనుచరులు ఉన్నారని చెప్పారు. అసలు నయీం ముఠానే ఉండవద్దన్నారు. తమ కుటుంబంలో అయిదుగురు చనిపోయినందున.. తమ కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. పగవాడికి కూడా ఈ కష్టం రావొద్దన్నారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications