కన్న కొడుకును దారుణంగా కొట్టిన వీడియో: నటుడు సుధీర్ బాబు ఆగ్రహం

బెంగళూరు/హైదరాబాద్: అబద్దం చెప్పాడనే కారణంతో పదేళ్ల కొడుకును ఓ వ్యక్తి దారుణంగా కొట్టాడు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. జనవరి 27వ తేదీన జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయింది.

చిన్న పిల్లాడు అని చూడకుండా మంచంపై విసిరేస్తూ, అతనిని కాలితో తన్నుతూ దుర్మార్గపు తండ్రి చిత్కబాదాడు. బాలుడిని అలా కొట్టేందుకు తల్లే ఉసిగొల్పడం గమనార్హం. కళ్ల ముందు కన్న బిడ్డ ఏడుస్తుంటే ఆపాల్సింది పోయి వీడియో తీసింది.

Bengaluru Plumber arrested after video of him beating up son goes viral

అంతేకాదు, ఆ బాలుడు అబద్దం చెబితే ఆ వీడియో చూపించి అలా కొడతామని హెచ్చరించేంది. ఆమె ఫోన్‌లో ఏదో సమస్య రావడంతో స్థానిక మొబైల్ షాపులో ఇచ్చారు. ఆ వీడియో చూసిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తండ్రిని అరెస్టు చేశారు.

కాగా, దీనిపై నటుడు సుధీర్ బాబు స్పందించారు. ప్లీజ్ అతను ఎక్కడ ఉంటాడో కనుక్కోండి. ఇంతకంటే దారుణంగా వాడిని చావబాదుతాను, అతను ఓ తండ్రి అని చెప్పేందుకు కూడా సిగ్గుగా ఉంది అని ఫేస్‌బుక్‌లో ఈ వీడియో పోస్ట్ చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+