రేపే రాములోరి లగ్గం.. శ్రీరామ నవమికి ముస్తాబైన భద్రాద్రి
Recommended Video

భద్రాచలం : భద్రాద్రి ముస్తాబైంది. సీతారాముల కల్యాణానికి సర్వం సిద్ధమైంది. జానకిరాముల వివాహ వేడుకను వైభవంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం తలమునకలైంది. వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. శ్రీ సీతారాముల తిరు కల్యాణోత్సవం ఆదివారం (14.04.2019) నాడు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. అలాగే సోమవారం (15.04.2019) నాడు రఘురాముడికి పట్టాభిషేకం జరపనున్నారు.
భద్రాద్రి రాములోరి గుడి విద్యుత్ దీపాల కాంతులతో కొత్త శోభ సంతరించుకుంది. భద్రాచలంలోని ప్రధాన కూడళ్లతో పాటు మెయిన్ సెంటర్లలో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాలతో పాటు స్వామివారి వివాహ వేడుక జరగనున్న మిథిలా ప్రాంగణంలో వేసవిని దృష్టిలో పెట్టుకుని చలువ పందిళ్లు వేయించారు. భక్తులకు ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించేలా కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేయించారు.

భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణం కనులారా వీక్షించేందుకు.. రాష్ట్రం నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రల నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. రెండు లక్షల మేర లడ్డు ప్రసాదాలు సిద్ధం చేశారు ఆలయ అధికారులు. అంతేకాదు రాములోరి లగ్గం సందర్భంగా వినియోగించే ముత్యాల తలంబ్రాలను భక్తులకు అందించేందుకు ప్రత్యేక కౌంటర్లను సిద్ధం చేశారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications