దేశంలో ఒకే పువ్వు ఉండాలా?: ఖమ్మంలో ప్రత్యేక కళ్లద్దాలు కావాలన్న భగవంత్
ఖమ్మం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బీజేపీ అంటే భారతీయ జుమ్లా పార్టీ అని.. ఎమ్మేల్యేల్ని కొనాలి.. అధికారంలోకి రావాలనేది ఆ పార్టీ సూత్రమని విమర్శించారు. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో భగవంత్ మాన్ పాల్గొని మాట్లాడారు. కంటి వెలుగు ఎంతో ప్రభావంతమైన పథకమన్నారు.

దేశంలో ఒకే పువ్వు ఉండాలా?: బీజేపీపై భగవంత్ మాన్ విమర్శ
సభకు వచ్చిన జనం చూస్తుంటే అద్భుతంగా ఉందని, ఏవైనా ప్రత్యేక కళ్ల అద్దాలు తయారు చేసి ఉంటే.. ఇంత జనాన్ని ఆ అద్దాల నుంచి చూసేవాడిని అంటూ భగవంత్ అన్నారు. ఈ దేశం రంగు రంగుల పూల సమాహారం అని, కానీ ఒకే పువ్వు ఉండాలని కొందరు చూస్తున్నారని ఆయన బీజేపీపై విమర్శలు చేశారు.
రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి ఏడాది ఇస్తామన్నారని, కానీ అవన్నీ జుమ్లాలుగా ఉండిపోయాయన్నారు.ఖాతాలోకి 15 లక్షల వస్తాయని హామీ ఇచ్చారు కానీ, అది కూడా అబ్ధంగా నిలిచిపోయిందని బీజేపీని విమర్శించారు. బీజేపీ అబద్ధాల పార్టీగా మారుతోందన్నారు.

మోడీ ప్రసంగం మార్చుకోవాలన్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్
లోకతంత్రం కాదు.. లూటీ తంత్రాన్ని బీజేపీ నడిపిస్తోందని భగవంత్ మాన్ ఆరోపించారు. కానీ, సమయం అన్నీ నేర్పుతుందని, రాజుల్ని కూడా అడుక్కునేలా చేస్తుందని బీజేపీకి హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి ఆగస్టుకు ప్రధాని ఢిల్లీ నుంచి సందేశం ఇస్తారని.. కానీ ఎప్పుడూ ఆ ఉపన్యాసమే ఉంటుందని ఆయన విమర్శించారు. ఉగ్ర దాడుల పట్ల చింతను వ్యక్తం చేస్తూ.. ప్రధాని తన ప్రసంగాన్ని ముగిస్తారని, ఆ పద్ధతి మార్చుకోవాలని సీఎం భగవంత్ మాన్ సూచించారు. అన్ని లూటీ చేయడమే బీజేపీ పని అని, రైల్వే, ఎల్ఐసీ, ఎయిర్‌పోర్టులను అన్నింటినీ అమ్మిందన్నారు.

ట్రంప్ కూతురుకు కేజ్రీవాల్ స్కూల్ చూపారన్న పంజాబ్ సీఎం
అన్ని తమకోసమే అన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోందన్నారు భగవంత్ మాన్. అన్ని రాష్ట్రాలను గెలుచుకోవాలని ఆరాటపడుతోందన్నారు. కేజ్రీవాల్ స్కూళ్ల గురించి బీజేపీ సర్కార్ విమర్శలు చేసిందని.. కానీ ట్రంప్ సతీమణి స్కూల్ చూడాలంటే.. కేజ్రీవాల్ స్కూల్‌ను చూపించారని భగవంత్ విమర్శలు చేశారు.
పంజాబ్‌లోనూ తెలంగాణ ప్రభుత్వం లాంటి పథకాలను ప్రవేశపెడుతామన్నారు. మంచి పనులు చూసి నేర్చుకోవాలన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేసిన సీఎం కేసీఆర్‌కు భగవంత్ మాన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications