130 కోట్ల మందికి వ్యాక్సిన్ కష్టం, అందుకే నాజల్ డ్రాప్స్: కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్

హైదరాబాద్: దేశంలో కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తున్నట్లు భారత్ బయోటెక్ సోమవారం ప్రకటించింది. అంతేగాక, కరోనావైరస్‌కు సంబంధించి కీలక ప్రకటన చేశారు భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా. హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్బీ) ఆన్‌లైన్‌లో నిర్వహించిన దక్కన్ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

నాజల్ డ్రాప్స్ వ్యాక్సిన్..

నాజల్ డ్రాప్స్ వ్యాక్సిన్..

కరోనాకు సంబంధించి ముక్కులో వేసుకునే చుక్కల మందు(డ్రాప్స్)పైనా ప్రయోగాలు చేస్తున్నట్లు డాక్టర్ కృష్ణా తెలిపారు. ప్రస్తుతం మూడో విడత క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్న కోవాగ్జిన్ రెండు డోసుల ఇంజెక్టబుల్ టీకా అని, దీన్ని దేశంలోని అందరికీ అందించాలంటే 260 కోట్ల సిరంజీలు, సూదులు అవసరమవుతాయని చెప్పారు. ఇది చాలా కష్టమైనపని అని, అందుకే నాజల్ డ్రాప్స్ వ్యాక్సిన్‌పై తాము ప్రయోగాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్

కోవాగ్జిన్ మూడో దశ ట్రయల్స్

కరోనా వచ్చిన తర్వాత కోవాగ్జిన్ టీకా కోసం ఐసీఎంఆర్‌తో తాము భాగస్వామ్యమయ్యామని కృష్ణా తెలిపారు. ప్రస్తుతం కోవాగ్జిన్ మూడో దశ పరీక్షలోకి ప్రవేశించిందని తెలిపారు. మూడో దశ ట్రయల్స్ దేశంలోని 22 ప్రాంతాల్లో 26,000 అభ్యర్థులను పరీక్షించనున్నారు.

130 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ కష్టం.. అందుకే ముక్కులో..

130 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ కష్టం.. అందుకే ముక్కులో..

కానీ, తాను సంతోషంగా లేనని చెప్పారు. ఎందుకంటే, ఇది రెండు డోసుల ఇంజెక్టబుల్ టీకా అని చెప్పారు. 130 కోట్ల మంది జనాభా కోసం టీకా కావాలంటే 260 కోట్ల సిరంజీలు, సూదుల అవసరమవుతాయి. ఆరోగ్య కేంద్రాల్లో ఈ రెండు డోసులను కలపలేరు. అందుకే తాము మరో టీకాపై ప్రయోగాలు చేస్తున్నట్లు తెలిపారు. ఇది ముక్కులో ఒక్కసారి వేస్తే సరిపోయే చుక్కల మందు అని చెప్పారు. గతంలో రోటా వైరస్, పోలియో కోసం చుక్కల మందు తయారు చేసిన అనుభవం తమకుందని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి తమ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందన్నారు.

భారత్ బయోటెక్ బీఎస్ఎల్-3 ఉత్పత్తి కేంద్రం..

భారత్ బయోటెక్ బీఎస్ఎల్-3 ఉత్పత్తి కేంద్రం..

ప్రపంచంలో బీఎస్ఎల్-3 ఉత్పత్తి కేంద్రం ఉన్న ఏకైక సంస్థ తమదేనని భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణా తెలిపారు. కరోనా చాలా ప్రమాదకరంగా మారుతుందని తాము ముందే ఊహించామని, అందుకే బీఎస్ఎల్-3 ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పుడు చైనా 250 మిలియన్ డాలర్లతో ఏర్పాటు చేస్తోందని తెలిపారు. అమెరికా, ఐరోపాలోనూ ఈ బీఎస్ఎల్-3 ఉత్పత్తి కేంద్రం లేదని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+