డ్యాన్స్ మాస్టర్ భరత్ మృతి: కాబోయే భార్యతో విభేదాలే కారణమా?
హైదరాబాద్: మరి కొద్దినెలల్లో పెళ్లి చేసుకోవాల్సిన యువ కొరియోగ్రాఫర్ (డ్యాన్స్‌మాస్టర్) భరత్ మరణంపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులు ఆత్మహత్యగా భావిస్తున్నారు. తనకు కాబోయే భార్యతో ఏర్పడిన విభేదాలే అతని ఆత్మహత్యకు కారణమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాదులోని సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మోతీనగర్ రామారావునగర్‌లో తన నివాసంలో భరత్ శనివారం అర్ధరాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. కడప జిల్లాకు చెందిన భరత్ (30) టీవీ కార్యక్రమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

ఇటీవల భరత్‌కు విజయవాడకు చెందిన ఓ యువతితో నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరిలో పెళ్లి జరుగాల్సి ఉంది. ఆ యువతి తనతో ఫోన్లో సరిగా మాట్లాడకపోవడం, కొన్ని సందర్భాల్లో ఫోన్ కట్ చేస్తుండడాన్ని భరత్ తీవ్రంగా తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే శనివారం అర్ధరాత్రి భరత్ ఫోన్ చేయగా శారద స్పందించ లేదని అంటున్నారు
దాంతో వాట్సప్‌లో మేసేజ్ పెట్టాడు. వాట్సప్ మేసేజ్‌కు స్పందించిన యువతి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పింది. దాంతో ఇద్దరి మధ్య ఫోన్‌లో కొంత వాగ్వాదం చోటుచేసుకుంది. చివరికి పెళ్లి జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినా ఆమె స్పందించలేదని, దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన భరత్ తన ఇంట్లోని ఫ్యాన్ దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications