భట్టి మద్దతివ్వలేదు, మారితే టీఆర్ఎస్‌ను ఢీకొట్టే పార్టీలోకే: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

హైదరాబాద్: అసెంబ్లీ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క తీరుపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ శాసనసభలో సోమవారం జరిగిన దానికి చాలా బాధపడ్డానని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. అధికార పార్టీ సభ్యులు తనపై విమర్శలు చేసిన విధానంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తనకు భట్టి విక్రమార్క అండగా నిలబడలేదన్న కోమటిరెడ్డి

తనకు భట్టి విక్రమార్క అండగా నిలబడలేదన్న కోమటిరెడ్డి

తమ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గట్టిగా నిలబడేది ఉండే కానీ, ఆయన అలా చేయలేదన్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి. అధికారం పక్షంతోపాటు తనది కూడా తప్పు అని అన్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో తన మాటలు రికార్డుల నుంచి తొలగించారని, అయితే, వారివి మాత్రం అట్లే ఉంచారని వాపోయారు. తన కోసం తమ సభ్యులు గట్టిగా నిలబడి ఉంటే ఎంత బలం ఉండేదిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. భట్టి విక్రమార్క విషయంలో ప్రతీ అంశంలో అండగా ఉన్నామని, ఆయన మాత్రం తమను వదిలేశారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తన విషయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడితే.. తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే.. జీవన్ రెడ్డి తన స్థాయికి సరిపోడని అన్నారు.

వెళ్తే టీఆర్ఎస్‌ను ఢీకొట్టే పార్టీలోకే: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

వెళ్తే టీఆర్ఎస్‌ను ఢీకొట్టే పార్టీలోకే: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

తాను ఏ పార్టీలోకి మారలేదని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఒకవేళ తాను పార్టీ మారాల్సి వస్తే.. బరాబర్‌గా పదవులకు రాజీనామా చేసి వెళ్తానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు తమ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాల వల్లే సైలెంట్ గా ఉన్నట్లు తెలిపారు. అంతేగాక, రేపటి రోజున పార్టీ మారాల్సి వస్తే పదవికి రాజీనామా చేస్తా.. టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టే పార్టీయే తన ఫ్లాట్ ఫామ్ అవుతుందన్నారు. జనం కూడా కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యత తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలోనే నిలబడి కొట్టాడతానని కోమటిరెడ్డి తెలిపారు. 10 మంది ఎమ్మెల్యేలను తాను గెలిపిస్తానని చెప్పుకొచ్చారు రాజగోపాల్ రెడ్డి.

కాంగ్రెస్ బలంగా ఉంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యలు

కాంగ్రెస్ బలంగా ఉంటూ కోమటిరెడ్డి వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉందని, గ్రామాల్లో ఇప్పటికీ క్యాడర్ బలంగా ఉందన్నారు. లీడర్లు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే అధికారంలోకి వస్తామని అన్నారు. పాదయాత్రలు ఎవరి నియోజకవర్గాల్లో వాళ్లు చేసుకుంటే సరిపోతుందన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసినా తాను స్వాగతిస్తానని అన్నారు రాజగోపాల్ రెడ్డి. కేసీఆర్, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఎవరు, ఏం చేసినా తన మద్దతు ఉంటుందని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతున్న క్రమంలో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

కోమటిరెడ్డికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్షమాపణలు చెప్పాలన్న జగ్గారెడ్డి

కోమటిరెడ్డికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్షమాపణలు చెప్పాలన్న జగ్గారెడ్డి

కాగా, సోమవారంనాటి అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంట్రాక్టర్ అని సంభోదించడం పట్ల ఆయన తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అయితే, తమ పార్టీ నేతను కాంట్రాక్టర్ అనడం సరికాదని భట్టి విక్రమార్క అన్నారు. ఇక ఇద్దరు నేతల వ్యాఖ్యలు సరికాదన్నట్లుగా వ్యాఖ్యానించారు. కాగా, మరోవైపు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. కోమటిరెడ్డికి మద్దతుగా నిలిచారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుంటే.. ఇష్యూ డైవర్ట్ చేయడానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంట్రాక్టర్ అని అన్నారని మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డిని పదే పదే కాంట్రాక్టర్ అనడం ఎందుకు? సమస్యలు పక్కదారి పట్టించాలని చూస్తూ ఊరుకోమన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల్లో కాంట్రాక్టర్లు లేరా? అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీలో వ్యక్తిగత వ్యాపారాల గురించి ఎందుకు ప్రస్తావించాలన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు జగ్గారెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+