హైదరాబాద్ కు దగ్గరలో మెరిసే బీచ్.. చూడ్డానికి రెండు కళ్లు చాలవు.. ఎలా వెళ్లాలి..?
తెలంగాణ ప్రజలకు బీచ్ లకు వెళ్లాలని ఉంటుంది. తెలంగాణలో సముద్ర తీరం లేని కారణంగా బీచ్ లను చూసేందుకు ఏపీ, తమిళనాడు, ఒడిశా ఇలా పక్క రాష్ట్రాలకు పర్యటిస్తుంటారు. అయితే ఏపీలో తీర ప్రాంతం ఉంది కాబట్టి చాలానే బీచ్ లు ఉన్నాయి. అయితే వాటిలో నీలి కాంతులు వెదజల్లుతూ మెరిసే బీచ్ గురించి మీకు తెలుసా..? నీలి కాంతులో ఆకాశం కిందకు వచ్చిందా అనేంతగా చూపరులను మైమరిపింప జేస్తుంది ఈ బీచ్. మరి ఈ బీచ్ ఎక్కడ ఉంది హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..?
విశాఖపట్నంలోని భీమిలీ బీచ్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ గా నిలుస్తోంది. సాధారణ రోజులతో పాటు వారాంతం, సెలవు రోజుల్లో ఇక్కడికి పర్యటకుల తాకిడి అధికంగా ఉంది. విశాఖకు కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ బీచ్ ప్రశాంత వాతావరణం, లైట్ హౌస్, సాగర కన్యల శిల్పాలు, బుద్ధ విగ్రహాలతో టూరిస్టులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. అయితే ఈ బీచ్ లు పర్యాటకులను పగటి వేళల్లో కంటే రాత్రి వేళల్లో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

అయితే ఇక్కడి సముద్ర నీటిపై ఫైటో ప్లాంక్టన్ అనే మైక్రో ఆల్కే తేలుతూ ఉండటం కారణంగా.. అది అప్పుడప్పుడూ బ్లూ కలర్ లో మెరుస్తూ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో సముద్ర అలలకు... లేదా మీరు ఆ నీటిని కాలితో కదిపినా నీలి రంగుతో కాంతి వస్తుంది. ఈ బయోలుమినిసెంట్ ప్లాంక్టన్ అంటే చీకటిలో కాంతిని విడుదల చేసే సూక్ష్మ సముద్ర జీవులని అర్థం వీటి కారణంగా ఈ బీచ్ రాత్రి వేళలో బ్లూ కలర్ లో కనిపిస్తుంటుంది. మరి భీమిలీ బీచ్ కు ఎలా వెళ్లాలి..?
భీమిలి బీచ్ కు వెళ్లేందుకు సికింద్రాబాద్ నుంచి విశాఖకు డైలీ రైళ్లు ఉంటాయి. అక్కడి నుంచి భీమిలి బీచ్ సులభంగా చేరుకోవచ్చు. ఇక విశాఖ నుంచి ప్రతిరోజు అధిక సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉంటాయి. విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి భీమిలి బీచ్ ప్రాంతానికి వెళ్లేందుకు బస్సు సౌకర్యం ఉంది. ఆర్టీసీ బస్సు అయితే 900K ఎక్కి వెళ్తే నేరుగా భీమిలి బీచ్ వద్దకు చేరుకోవచ్చు.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications