తెలంగాణలో వారికి వర్క్ ఫ్రమ్ హోమ్.. ఎలా అప్లై చేసుకోవాలంటే..?

తెలంగాణలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. కాకతీయులు, నిజాంల కాలం నుంచి ఎన్నో ప్రసిద్ధ ఆలయాలు, కట్టడాలు పర్యటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ టూరిజాన్ని ప్రపంచ చిత్ర పటంలో నిలబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లో జరిగినప్పుడు తెలంగాణ ఖ్యాతి ప్రపంచమంతా మార్మోగింది. మరోసారి తెలంగాణ పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

వివిధ దేశాలు.. రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే పర్యాటకులకు సౌకర్యవంతమైన హోమ్ స్టే వసతి సౌకర్యాలను అందించేందుకు.. జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలు, పర్యాటక గమ్య స్థానాల్లో వసతి లభ్యతను పెంపొందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం.. తెలంగాణ టూరిజం హోమ్ స్టే కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా హోమ్‌ స్టేల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది.

రాష్ట్ర పర్యాటక శాఖ తీసుకొచ్చిన ఈ తెలంగాణ టూరిజం హోమ్ స్టే కార్యక్రమంలో భాగంగా విదేశీ, దేశీయ పర్యాటకులకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన నివాసాన్ని అందించడం.. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి ఉండి స్థానిక సంప్రదాయాలను అనుభూతిని కల్పించడం, తెలంగాణలోని ఫేమస్ వంటకాల రుచిని ఆస్వాదించే అవకాశాన్ని కల్పించే ఉద్దేశ్యంతో కార్యక్రమాన్ని తీసుకొచ్చారు.

Big News Telangana Tourism Launches Home Stay Program Applications Open Statewide

తెలంగాణలో హోమ్ స్టే వర్గీకరణ.. లేదా పునర్వర్గీకరణ కోసం చెల్లించాల్సిన దరఖాస్తు రుసుములు నిర్ణయించింది. ఆసక్తికలిగిన వ్యక్తులు డిమాండ్ డ్రాఫ్ట్‌ను 'కమిషనర్ / డైరెక్టర్ ఆఫ్ టూరిజం, తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్' పేరుతో చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న హోమ్ స్టేలను సిల్వర్, గోల్డ్ అని రెండు రకాలుగా వర్గీకరించారు. సిల్వర్ కేటగిరీ కోసం దరఖాస్తు చేయాలంటే రూ. 2 వేలు అలాగే గోల్డ్ కేటగిరీకి దరఖాస్తు చేయాలంటే రూ. 4 వేలు చెల్లించుకోవాలి. దరఖాస్తు ఫామ్ లను అభ్యర్థులు టూరిజం డిపార్ట్ మెంట్, హైదరాబాద్ లేదా tourism.telangana.gov.in ద్వారా పొందొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+