మాజీ మంత్రి హరీష్ రావుకు బిగ్ రిలీఫ్.. భయపడనంటూ కామెంట్స్
బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన తప్పుడు సమాచారాన్ని అందించి విజయం సాధించారని కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో హరీష్ రావుపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఈ క్రమంలోనే పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు హరీష్ రావు ఎన్నికకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను కొట్టి వేసింది. కాగా పిటిషన్‌కు సంబంధించి సరైన ఆధారాలు లేకపోవడంతో హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసినట్టు తెలుస్తోంది.

ఈ వ్యవహారంపై స్పందించిన హరీష్ రావు.. రాజకీయ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని అన్నారు. న్యాయస్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అడుగడుగునా ఎదురుదెబ్బలు తగులుతున్నాయని విమర్శలు గుప్పించారు. తమకు న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం ఉందని.. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అధికార పార్టీ ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకులపై కక్ష సాధింపు రాజకీయాలు మానుకొని హితవు పలికారు.












Click it and Unblock the Notifications