కవిత మధ్యంతర బెయిల్ పై కోర్టు కీలక నిర్ణయం..!!

ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీలో రౌస్‌ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కవిత మధ్యంతర బెయిల్ పిటీషన్ ను తిరస్కరించింది. కవితకు బెయిల్‌ ఇవ్వొద్దని కోర్టును కోరిన ఈడీ.. బెయిల్‌ ఇస్తే సాక్షాలను ప్రభావితం చేస్తారంటూ వాదనలు వినిపించింది. మార్చి 26 నుంచి తిహార్‌ జైల్‌లో ఉన్నారు. రేపటితో కవిత జ్యూడీషియల్ రిమాండ్ పూర్తి కానుంది. దీంతో, కవిత నెక్స్ట్ స్టెప్ పైన ఆసక్తి కొనసాగుతోంది.

కవితకు మరో షాక్
పార్లమెంట్ ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ కేసులో బీఆర్ఎస్ ముఖ్య నేత కవిత అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో మార్చి 15న కవితను ఈడీ అధికారులు హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం కవిత తిహార్‌ జైల్లో ఉన్నారు. తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ రోస్ అవెన్యూ కోర్టు లో కవిత మధ్యంతర బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. కవిత తరపున అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు. చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో కవిత బెయిల్‌ కోరారు.

Big Shock for MLC Kavitha Rouse Avenue court refused to Interim bail in delhi liquor scam

బెయిల్ నిరాకరణ
ఈడీ తరపున జోయబ్ హుసేన్ వాదనలు వినిపించారు. కుమారుడి పరీక్షల కారణంగా కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని రెండో పిటిషన్‌పై న్యాయస్థానం విచారించింది. కవిత కొడుక్కి పరీక్షలు ఉన్నాయని, అందుకే బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు అభిషేక్‌ సింఘ్వీ. ఈడీ తరపు న్యాయవాది తన వాదనల్లో డిల్లీ లిక్కర్ కేసులో కవిత ప్రదాన సూత్రదారిగా పేర్కొన్నారు. అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదన్నారు.

Big Shock for MLC Kavitha Rouse Avenue court refused to Interim bail in delhi liquor scam

ఏప్రిల్ 20కి వాయిదా
ఒకవేళ బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు వివరించారు. లిక్కర్ స్కామ్‌ను ప్లాన్ చేసిందే కవిత అని.. ఫోన్ డేటా మొత్తాన్ని డిలీట్ చేశారని ఆరోపించారు. గతంలో విచారించిన సమయంలో మొత్తం 10 ఫోన్లను కవిత ఇచ్చారని.. కానీ అవి మొత్తం ఫార్మాట్ చేసినవేనని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నోటీసులు ఇచ్చిన తరువాత 4 ఫోన్లను ఫార్మాట్ చేశారని కోర్టుకు నివేదించారు. కవిత రెగ్యులర్‌ బెయిల్‌పై వాదనలను ఏప్రిల్‌ 20కు వాయిదా వేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+