Bigg Boss 5 Telugu: మరీ అంత ఓవర్ యాక్షన్ అంటే చూడలేం తల్లోయ్: ఎసరు పెట్టిన వెక్కరింతలు

హైదరాబాద్: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లో ఇవ్వాళ మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నారు. మరొకరు బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లిపోనున్నారు. ఇప్పటికే 10 ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటిదాకా సరయు, ఉమాదేవి, లహరి షారీ, నటరాజ్ మాస్టర్, హమీదా ఖాతూన్, శ్వేతా వర్మ, ప్రియ, లోబో, విశ్వ ఎలిమినేట్ అయ్యారు. ఆరోగ్య కారణాలతో జెస్సీ అలియాస్ జస్వంత్ పడాల బిగ్‌బాస్ హౌస్‌ను వీడాల్సి వచ్చింది.

సింగిల్ డిజిట్‌లోకి..

సింగిల్ డిజిట్‌లోకి..

బిగ్‌బాస్ సీజన్ తెలుగు 5లో కంటెస్టెంట్ల సంఖ్య సింగిల్ డిజిట్‌కు పడిపోయింది. 19 మందితో మొదలైన ఈ రియాలిటీ షోలో ఇప్పుడు మిగిలింది తొమ్మిదిమందే. యూట్యూబర్ సరయు, ఉమాదేవి, లహరి షారీ, కోరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్, హమీదా ఖాతూన్, శ్వేతా వర్మ, ప్రియ, లోబో, విశ్వ ఎలిమినేట్ అయ్యారు. జశ్వంత్ పడాల అలియాస్ జెస్సీ.. ఆరోగ్య కారణాలతో బిగ్‌బాస్ హౌస్‌ను వీడాల్సి వచ్చిది. టైటిల్ కోసం పోటీ పడుతున్న కంటెస్టెంట్లు తొమ్మిదిమందే ఉన్నారు.

ఆ ఒక్కడు తప్ప..

ఆ ఒక్కడు తప్ప..

ఈ వారం ఎనిమిది మంది ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. యాంకర్ రవి తప్ప మిగిలిన కంటెస్టెంట్లందరూ ఈ ఎలిమినేషన్స్ లిస్ట్‌లోకి ఎక్కారు. ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ, సిరి హన్మంతు, షణ్ముఖ్ జశ్వంత్, మానస్ నాగులపల్లి, ఆర్జే కాజల్, వీజే సన్నీ, ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్ర, యానీ మాస్టర్.. నామినేట్ అయ్యారు. వారిలో సన్నీ, శ్రీరామచంద్ర సేఫ్ అయ్యారు. మిగిలిన వారు డేంజర్ జోన్‌లోనే కంటిన్యూ అవుతున్నారు.

యానీ మాస్టర్- ఆర్జే కాజల్

యానీ మాస్టర్- ఆర్జే కాజల్

యానీ మాస్టర్-ఆర్జే కాజల్ మధ్య ఎప్పట్లాగే హీట్ డిబేట్ సాగింది. ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. తొలుత ఆర్జే కాజల్.. యానీ మాస్టర్, సిరి హన్మంతులను నామినేట్ చేశారు. ఈ సమయంలో కాజల్-యానీ మాస్టర్ మధ్య మరోసారి వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇద్దరూ ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకున్నారు. యానీ మాస్టర్ ఓ అడుగు ముందుకేసి డాన్స్ చేస్తూ వెక్కిరించారు.

మానస్ నాగులపల్లి కూడా యానీ మాస్టర్‌ను నామినేట్ చేశారు. హగ్ ఇష్యూ వారిద్దరి మధ్య వచ్చింది. మానస్.. యానీ మాస్టర్‌ను నామినేట్ చేయడం ఇదే తొలిసారి.

జెస్సీని తలచుకుంటూ డాన్స్..

జెస్సీని తలచుకుంటూ డాన్స్..

యానీ మాస్టర్-కాజల్ మధ్య మళ్లీ హాట్ డిబేట్ సాగింది. తాను దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. పట్టించుకోవట్లేదంటూ కాజల్ చెప్పిన కారణాన్ని యానీ మాస్టర్ రిజెక్ట్ చేయడం.. మళ్లీ మళ్లీ వెక్కరించడం కనిపించింది. వెక్కిరించడం తనకు ఇష్టం ఉండదంటూ కాజల్ చెబుతున్నప్పటికీ- యానీ మాస్టర్ అదే పని చేశారు. జెస్సీ మై బోయ్ అంటూ జశ్వంత్ పడాలను గుర్తు తెచ్చుకుంటూ డాన్స్ చేశారు. ఈ వారం వారిద్దరి మధ్య ఎలాంటి వాతావరణం ఉంటుందనేది ఈ ఎపిసోడ్ చెప్పకనే చెప్పినట్టయింది.

మెచ్యుర్డ్‌గా ఉండట్లేదు..

మెచ్యుర్డ్‌గా ఉండట్లేదు..

ఈ వెక్కరింపులు, డాన్స్‌లే యానీ మాస్టర్‌కు ఎసరు పెట్టినట్టయింది. ఆ ఓవర్ యాక్షన్‌ను చూడలేకపోతున్నామంటూ వ్యూవర్స్ అభిప్రాయపడుతున్నారు. హోస్ట్ అక్కినేని నాగార్జున సైతం ఇదే ఒపీనియన్‌ను ఓపెన్ చేశారు. శనివారం రాత్రి కన్ఫెషన్ రూమ్‌కు పిలిపించిన ఆయన యానీ మాస్టర్ చేసిన అతి పట్ల సున్నితంగా మందలించారు. హౌస్‌లో ఉన్న ఇతర కంటెస్టెంట్ల కంటే మెచ్యుర్డ్ ఆలోచించ గలిగే శక్తి ఉందని చెప్పారు. మెచ్యుర్డ్, ఇమ్‌మెచ్యుర్డ్‌కు ఉన్న తేడాను తెలుసుకోవాలని హితబోధ చేశారు.

ఓటింగ్‌లో లీస్ట్..

ఓటింగ్‌లో లీస్ట్..

ఈ వారం లీస్ట్ ఓటింగ్‌ను సాధించారు యానీ మాస్టర్. ప్రస్తుతం డేంజర్ జోన్‌లో ఉన్న ఆరుమందిలో యానీ మాస్టర్‌లో లాస్ట్ ప్లేస్‌లో నిలిచారు తక్కువ ఓటింగ్‌తో. షణ్ముఖ్ జస్వంత్-24,853, కాజల్-5,479, సిరి హన్మంతు-4,421, మానస్ నాగులపల్లి-4,264, ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ-3,515 ఓట్లు పోల్ అయ్యాయి. వారందరి కంటే తక్కువగా యానీ మాస్టర్‌కు 3,348 ఓట్లు పడినట్లు తెలుస్తోంది. దీనితో ఆమె బిగ్‌బాస్ హౌస్‌ నుంచి బయటికెళ్తారని సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+