VJ Sunny: ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా..బిగ్‌బాస్ విన్నర్‌గా: ఆ రెండు డైలాగ్స్‌‌తో యూత్‌లో క్రేజ్

హైదరాబాద్: వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5.. విజేతగా వీజే సన్నీ ఆవిర్భవించాడు. కొద్దిసేపటి కిందటే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలె ముగిసింది. ఏ క్షణం కోసమైతే 19 మంది కంటెస్టెంట్లు పోటీ పడ్డారో.. ఆ క్షణం రానే వచ్చింది. విన్నర్ ఎవరో తేల్చేసింది. టాప్ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్.. రన్నరప్‌గా నిలిచాడు. ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్ర మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ టైటిల్ కోసం 19 మంది పోటీ పడ్డారు. వారిలో సన్నీ ఒక్కడే విన్నర్‌గా నిలిచాడు. పరైజ్ మనీ కింద అతనికి 50 లక్షల రూపాయల నగదు. ఓప్లాట్ అందించారు నిర్వాహకులు. నాలుగు, అయిదు స్థానాల్లో మానస్ నాగులపల్లి, సిరి హన్మంత్ నిలిచారు.

నాగార్జునే ఎంట్రీ..

నాగార్జునే ఎంట్రీ..

తొలి అయిదుమందిలో నిలిచిన వారిని ఎలిమినేట్ చేయడానికి వేర్వేరు మంది సెలెబ్రెటీలు బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చారు. విన్నర్‌ను తేల్చేయడానికి అక్కినేని నాగార్జునే బరిలోకి దిగారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ అయ్యారు. అంతకుముందు జాతిరత్నాలు హీరోయిన్ ఫారియా అబ్దుల్లా ఎంట్రీ ఇచ్చారు. అక్కడే విన్నర్ ఎవరో తెలిసిపోతుందని భావించారంంతా. అక్కడే బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. మరో గేమ్ ఆడాల్సి ఉంటుందంటూ నాగార్జున ఆ ఇద్దరినీ ఆదేశించాడు. అనంతరం తానే స్వయంగా హౌస్‌లో ఎంట్రీ అయ్యాడు. ఇద్దరినీ స్టేజీ మీదికి తీసుకొచ్చాడు. విన్నర్‌ను ప్రకటించాడు.

విన్నర్ అతడే..

విన్నర్ అతడే..

బిగ్‌బాస్ టైటిల్ కోసం పోటీ పడుతోన్న కంటెస్టెంట్లలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న వీజే సన్నీ.. ఈ సీజన్ విన్నర్‌గా నిలిచాడు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అతను తన టాలెంట్‌తో టాప్-5లో చోటు దక్కించుకోగలిగాడు. టాప్-3కీ చేరుకున్నాడు.. చివరికి గెలుపుటంచులను ముద్దాడాడు. ఇదివరకు విన్నర్లుగా నిలిచిన వారికి ఏదో ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉండేది. శివబాలాజీ, కౌశిక్, రాహుల్ సిప్లిగంజ్, అభిజీత్.. వీరందరూ బిగ్‌బాస్ హౌస్‌లోకి రాకముందు నుంచే ప్రేక్షకులకు తెలుసు. వీజే సన్నీ.. వీరందరికీ డిఫరెంట్. పెద్దగా బ్యాక్‌గ్రౌండ్ అంటూ ఏదీ లేకుండానే విన్నర్‌గా నిలిచాడు.

ఆ డైలాగ్స్‌తో యూత్‌కు చేరువగా..

ఆ డైలాగ్స్‌తో యూత్‌కు చేరువగా..

వీజే సన్నీ.. తన ఫైర్ బ్రాండ్‌తో యూత్‌ను ఆకట్టుకున్నాడు. అతను తరచూ మచ్చా, డార్లింగ్ అనే పదాలను వాడటం యూత్‌కు మరింత దగ్గర చేసింది. మచ్చా అనే డైలాగ్ చాలా పాపులరైందంటూ నాగార్జున సైతం కితాబిచ్చాడు. ఫ్రెండ్స్ మధ్య చాలా సాధారణంగా వెలువడే పదాలివి. నేచురల్‌గా ఉండటం, బయట ఎలా ఉంటాడో.. బిగ్‌బాస్ హౌస్‌లోనూ అదే తరహాలో ప్రవర్తించడం అతనికి ప్లస్ పాయింట్ అయింది. అతని డ్రెస్సింగ్ స్టైల్ సైతం యూత్‌ను కట్టిపడేసింది. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం సన్నీని మరింత చేరువ చేసింది. ఫ్రెండ్‌షిప్ కోసం ఎంతకైనా త్యాగం చేస్తాడని పేరు తెచ్చుకున్నాడతను. ఇదివరకు తనకు దక్కిన ఎవిక్షన్ పాస్‌ను ఆర్జే కాజల్ కోసం వినియోగించడాన్ని దీనికి నిదర్శనం.

రన్నరప్‌గా షణ్ముఖ్..

రన్నరప్‌గా షణ్ముఖ్..

టాప్ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్..రెండో స్థానంలో నిలిచాడు. షన్ను రెండోస్థానంలో ఉంటాడనే అంచనాలు మొదట్లో వ్యక్తం అయ్యాయి. దీనికి అనుగుణంగానే ఓటింగ్ శాతం కూడా కొనసాగింది. శనివారం రాత్రి వరకూ అతను రెండో స్థానంలోనే కనిపించాడు ఓటింగ్ పర్సంటేజ్‌లో. ఆ తరువాత ఫలితాలు తారుమారయ్యాయనే ప్రచారం సాగింది. శ్రీరామచంద్ర రెండో స్థానంలో ఉంటాడనే గ్యాసిప్స్ వెలువడ్డాయి. అలాంటి అద్భుతాలేవీ చోటు చేసుకోలేదు. శ్రీరామచంద్ర మూడో స్థానంలో నిలిచాడు. సిరి హన్మంతుతో ట్రాక్ నడిపించడం షణ్ముఖ్ జశ్వంత్‌కు మైనస్ పాయింట్‌గా మారిందని భావించారు. దాని ప్రభావం కొంత వరకు కనిపించినట్టే. దాని ఎఫెక్ట్ వల్లే రెండో స్థానంలో నిలిచారని వాదించే వారూ లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+