నామినేషన్స్ తో హౌస్ లో కొత్త చిచ్చు : ఎవరు ఎవరిని నామినేట్ చేసారంటే : ఆ ఎపిసోడ్ లో పోటాపోటీగా..!!
బిగ్ బాస్ సీజన్ 5 కార్యక్రమానికి సంబంధించి మూడో వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఒకరిపై మరొకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ హౌజ్ ని రణరంగంగా మార్చేశారు.ప్రియ.. తనను బాడీ షేమింగ్ చేసిందని హమీదా మండిపడింది. హమీదా ప్రియపై ఫైర్ కావడంతో రవితో పాటు మిగిలిన మెన్స్ చప్పట్లు కొడుతూ కనిపించారు. ఇక, నామినేషన్స్‌తో హౌస్‌లో కొత్త చిచ్చుకు బిగ్‌బాస్ కారణమయ్యాడు. ఈ నామినేషన్ ప్రక్రియతో కంటెస్టెంట్ల మధ్య పెరిగిన దూరాన్ని చెరిపేసేందుకు ఎంటర్ టైన్ మెంట్ టాస్క్ ఇచ్చాడు.
హమీదా.. ప్రియాంక సింగ్ పై కూడా నిప్పులు చెరిగింది. మంగళవారం కూడా నామినేషన్ రచ్చ సాగగా చివరకు ఏ సభ్యుడు ఎవరిని నామినేట్ చేశారో చూస్తే..జెస్సీ.. మానస్, నటరాజ్ మాస్టర్‌ను నామినేట్ చేశాడు. ఈ క్రమంలో మాస్టర్, జెస్సీకి మధ్య పెద్ద ఫైటే జరిగింది. ఒకరు చెప్తేనే నన్ను నామినేట్ చేశావని తెలుసు, నువ్వో చిన్నపిల్లోడివి, జుజ్జూ అంటూ ఫైర్ అయ్యాడు. తర్వాత షణ్ముఖ్.. ప్రియ, లహరిని; శ్వేత.. శ్రీరామచంద్ర, లోబోను; హమీదా.. ప్రియ, ప్రియాంక సింగ్‌ను; కాజల్.. ప్రియాంక, ప్రియను; విశ్వ.. నటరాజ్ మాస్టర్, ప్రియను నామినేట్ చేశారు.

ఇక ఈ ప్రక్రియ ముగిసిన అనంతరం లహరి, ప్రియాంక, ప్రియ, మానస్, శ్రీరామ్ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. తర్వాత బిగ్‌బాస్.. హౌస్‌మేట్స్‌కు 'హైదరాబాద్ అమ్మాయి - అమెరికా అబ్బాయి' టాస్క్ ఇచ్చాడు. హైదరాబాద్ అమ్మాయి కుటుంబలో లహరి అమ్మాయి, జెస్సీ ఆమె సోదరుడిగా, యానీ మాస్టర్, నటరాజ్ మాస్టర్ వీరి తల్లిదండ్రులుగా, రవి అమ్మాయి మామయ్యగా, ప్రియాంక చిన్ననాటి స్నేహితురాలిగా నటించాల్సి ఉంటుంది.
Recommended Video
అమెరికా అబ్బాయి కుటుంబంలో శ్రీరామ్ అమెరికా నుంచి వచ్చిన అబ్బాయిగా, కాజల్ అతడి అక్కగా, ప్రియ వీరి తల్లిగా, విశ్వ అబ్బాయి పర్సనల్ అసిస్టెంట్‌గా, సిరి చిన్ననాటి స్నేహితురాలుగా, సన్నీ అబ్బాయి స్నేహితుడిగా, షణ్ముఖ్ మ్యారేజ్ బ్రోకర్‌గా, లోబో ఈవెంట్ మేనేజర్, శ్వేత లోబో అసిస్టెంట్, హమీదా.. అబ్బాయి ఎక్స్‌గర్ల్‌ఫ్రెండ్, మానస్ అమ్మాయి పొరుగింటివారిగా నటించాల్సి ఉంటుంది. టాస్క్ మొదలవగానే కంటెస్టెంట్లు అందరూ పోటీపడుతూ నటించారు. ఈ టాస్క్ ఈ రోజు ఎపిసోడ్‌లో సైతం కంటిన్యూ కానుంది.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..!












Click it and Unblock the Notifications