Bigg Boss 6 Telugu winner: చివరినిమిషంలో అద్దిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన నాగ్

హైదరాబాద్: టాలీవుడ్ అందగాడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న వరల్డ్ బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6.. ఫైనల్ ముగిసింది. ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలిపోయింది. ఈ టైటిల్ కోసం పోటీ పడిన చివరి అయిదు మందిలో టైటిల్ ఎవరు ఎగరేసుకెళ్లారనే విషయాన్ని నాగార్జున స్వయంగా ప్రకటించారు. అదే సమయంలో చివరి నిమిషంలో అద్దిరిపోయే ఫైనల్ టచ్ ఇచ్చారాయన.

105 రోజుల పాటు..

105 రోజుల పాటు..

105 వారాల పాటు సాగిందీ బిగ్‌బాస్ సీజన్. ఇవ్వాళ గ్రాండ్ ఫినాలె ముగిసింది. ఈ సాయంత్రం 6 గంటలకు ఫినాలె ఆరంభమైంది. అయిదు గంటల పాటు ఆటపాటలతో కొనసాగింది. ఎప్పట్లాగే డిఫరెంట్‌ లుక్‌తో అదరగొట్టాడీ టాలీవుడ్ మన్మధుడు. ఈ ఫినాలెకు నిఖిల్, రవితేజ, అలనాటి టాప్ హీరోయిన్ రాధ అటెండ్ అయ్యారు. అలాగే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజేతగా నిలిచిన వీజే సన్నీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. ఈ సీజన్ కంటెస్టెంట్లతో పాటు టాప్-5లో నిలిచిన వారి కుటుంబ సభ్యులతో హాజరయ్యారు.

విన్నర్ అతడే..

విన్నర్ అతడే..

బిగ్‌బాస్ టైటిల్ కోసం పోటీ పడుతోన్న కంటెస్టెంట్లలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ప్లేబ్యాక్ సింగర్ రేవంత్.. ఈ సీజన్ విన్నర్‌గా నిలిచాడు. ఇదివరకు శివబాలాజీ, కౌశిక్, రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్, వీజే సన్నీ సరసన చేరాడు. శ్రీహాన్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ సీజన్‌ చివరి అయిదుమందిలో తొలుత రోహిత్ ఎలిమినేట్ అయ్యాడు. హీరో కార్తీక్ అతణ్ని ఎలిమినేట్ చేశాడు. ఆ తరువాత కీర్తి, అనంతరం ఆదిరెడ్డి హౌస్ నుంచి బయటికి వచ్చారు. రేవంత్, శ్రీహాన్ చివరి వరకూ నిలిచారు.

శ్రీహాన్ గెలిచినా..

శ్రీహాన్ గెలిచినా..

చివరి నిమిషంలో అద్దిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. నిజానికి- ఈ సీజన్‌ టైటిల్‌ను గెలుచుకున్నది.. శ్రీహాన్. రేవంత్ కంటే ఒకశాతం ఓట్లను అధికంగా సాధించాడు. విన్నర్‌ పేరును ప్రకటించడానికి ముందు నాగార్జున ఇచ్చిన బ్రీఫ్ కేస్ ఆఫర్‌‌కు శ్రీహాన్ ఓకే చెప్పాడు. 40 లక్షల రూపాయల బ్రీఫ్ కేస్‌ ఆఫర్‌ను అందుకున్నాడు. దీనితో రేవంత్‌ను టైటిల్ విన్నర్‌గా ప్రకటించాల్సి వచ్చిందని నాగార్జున తెలిపారు. విన్నర్‌కు టైటిల్‌తో పాటు ఇంటిస్థలం, 10 లక్షల రూపాయల నగదును బహుమతిగా అందజేశారు.

గతంలో కూడా..

గతంలో కూడా..

గత సీజన్‌లోనూ ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్ర రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. వీజే సన్నీతో పోటీ పడుతూ ఓట్లను దక్కించుకున్నప్పటికీ.. అది అతణ్ని అధిగమించేలా ఉండట్లేదు. ఇప్పుడు టైటిల్‌ను గెలుచుకునే గోల్డెన్ ఛాన్స్ మరో ప్లేబ్యాక్ సింగర్ రేవంత్‌కు దక్కడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకు సోనీ టీవీలో నిర్వహించిన ఇండియన్ ఐడల్ విన్నర్‌గా కూడా అవార్డును అందుకున్నాడు రేవంత్. శ్రీరామచంద్ర కూడా ఇండియన్ ఐడల్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+