Bigg Boss Telugu 7: హౌస్‌లో గ్లామర్ ట్రీట్- కంటెస్టెంట్లు వీరేనా..!!

హైదరాబాద్: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 త్వరలో ఇంటింటినీ పలకరించబోతోంది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి బిగ్ బాస్ సీజన్ 7 ఆరంభం కాబోతోంది.. గ్రాండ్‌గా. దీనికి సంబంధించిన లోగో ప్రోమో ఇదివరకే విడుదలైంది.

నాగార్జున తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌‌పై దీన్ని పోస్ట్ చేశారు. ఆ వెంటనే అది వైరల్‌గా మారింది. ఇప్పటివరకు అయిదు సీజన్లల్లో బిగ్ బాస్ హౌస్‌లో కనిపించిన గ్లామర్ వేరు.. ఇప్పుడు చూడబోయే ట్రీట్ వేరు. ప్రోమో దీన్ని ప్రూవ్ చేస్తోంది కూడా. 2017లో తొలిసారిగా తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మొదలైంది. నిరాటంకంగా కొనసాగుతూ వస్తోంది.

Bigg Boss 7

కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల్లో కూడా దీనికి బ్రేక్ పడలేదు. తొలి సీజన్‌కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆ తరువాత ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నాడు. ఆ సీజన్‌లో నటుడు శివబాలాజీ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. ఆదర్శ్ రన్నరప్. రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించాడు.

ఆ సీజన్‌లో కౌశల్ మందా విన్నర్ కాగా.. ప్లేబ్యాక్ సింగర్ గీతా మాధురి రెండో స్థానంలో నిలిచారు. మూడో సీజన్ నుంచి అక్కినేని అందగాడి హవా మొదలైంది. 2019 నాటి మూడో సీజన్‌లో నేపథ్య గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ విజేతగా ఆవిర్భవించాడు. టాప్ యాంకర్ శ్రీముఖి రెండో స్థానానికి పరిమితం అయ్యారు.

Bigg Boss 7

నాలుగో సీజన్‌ టైటిల్‌ను అభిజిత్ ఎగరేసుకెళ్లాడు. అఖిల్ సార్థక్ రన్నరప్. ఆ తరువాతి సీజన్‌లో వీజే సన్నీ ఛాంపియన్ కాగా యూట్యూబర్ షణ్ముఖ్‌ది రెండోస్థానం. ఈ సీజన్‌ టైటిల్ కోసం మరో 16 మంది కంటెస్టెంట్లు పోటీ పడే అవకాశం ఉంది. ఇప్పటికే కొందరిని సెలెక్ట్ చేసినట్లు చెబుతున్నారు. కొన్ని పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ఇందులో సింగర్ మోహన్ భోగరాజు, ప్రభాకర్, యాంకర్ నిఖిల్ డీ, కోరియోగ్రాఫర్ పాండు, టిక్ టాక్ కపుల్ దుర్గారావు పేర్లు వినిపిస్తోన్నాయి. శ్వేతా నాయుడు, యాంకర్ ధనుష్​, శోభితా షెట్టి పేర్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. జబర్దస్త్ నుంచి ఒకరిని తీసుకుంటారని సమాచారం. గత సీజన్‌లో చలాకి చంటి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

Bigg Boss 7

ఈ సారి కూడా జబర్దస్త్ టీమ్ నుంచి ఒకరిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది.​ అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. విడాకులు తీసుకున్న ఓ జంటను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 అంతకుమించి అనే స్థాయిలో ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. హౌస్‌ను కూడా ఇంకాస్త డిఫరెంట్‌గా తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు. దీనికి తగ్గట్టుగా కంటెస్టెంట్ల లిస్ట్ కూడా మరింత గ్లామరస్‌గా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+