Bigg Boss Telugu 5: ప్రియ-యంకర్ రవి-లహరి ట్రయాంగిల్ ఎపిసోడ్: ఒకరు ఎలిమినేట్

హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. మూడో వారంలోకి ఎలిమినేషన్‌లోకి ఎంట్రీ అయింది. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ మధ్య టాస్కులు కాస్త మోతాదు మించుతున్నాయి. నటి ప్రియ-యాంకర్ రవి-లహరి మధ్య సాగిన ఎపిసోడ్స్ వీక్షకులను కాస్త ఇరిటేట్‌కు గురి చేసినట్లు చెబుతున్నారు. ఈ ముగ్గురిలో ఒకరు ఈ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారు.

ఎలిమినేట్ అయ్యేదెవరు?

ఎలిమినేట్ అయ్యేదెవరు?

మూడో ఎలిమినేషన్ డే వచ్చేసింది. బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎవరు బయటికి ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తిగా మారింది. లహరితో పాటు నామినేషన్ ప్రక్రియలో ఆమె-యాంకర్ రవిపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసిన నటి ప్రియ, ప్రియాంక సింగ్, గాయకుడు శ్రీరామచంద్ర, మానస్ నాగులపల్లి ఎలిమినేషన్‌లో లిస్ట్‌లో ఉన్నారు. ఈ వారం కూడా లేడీ కంటెస్టెంట్‌నే బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి పంపించనున్నారు. తొలివారంలో యూట్యూబర్ సరయు, రెండో వారంలో నటి ఉమాదేవి ఎలిమినేట్ అయ్యారు.

ఎలిమినేషన్‌లో చివరివరకూ

ఎలిమినేషన్‌లో చివరివరకూ

మూడో వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి లహరి షారీ ఎలిమినేట్ అవుతారనే ప్రచారం సాగుతోంది. వీక్షకుల నుంచి పెద్దగా ఆమెకు ఓట్లు రాలేదని, ఫలితంగా ఆమెను హౌస్ నుంచి బయటికి పంపిస్తారని తెలుస్తోంది. యాక్ట్రెస్ ప్రియ, లహరి షారీ మధ్య చివరి వరకూ ఉత్కంఠతగా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. లహరి కంటే కొద్దిగా ఎక్కువ శాతం ఓట్లు పోల్ కావడం వల్ల ప్రియ బిగ్‌బాస్ హౌస్‌లో కంటిన్యూ కాగా.. లహరి ఎలిమినేట్ అవుతారని సమాచారం. లహరి తరువాత అతి తక్కవ శాతం ఓట్లు ప్రియకు పోల్ అయ్యాయట.

చివరి వరకూ నటరాజ్ మాస్టర్, ఉమాదేవి..

ప్రియ, లహరి ఎలిమినేషన్ చివరి రౌండ్ వరకు కొనసాగుతారు. వారిలో ప్రియ సేఫ్ జోన్‌లోకి వెళ్లగా.. లహరి బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారనే ప్రచారం ఉంది. బిగ్‌బాస్ హౌస్‌లో లహరి నేచురల్‌గా ఉండట్లేదని, డ్రమటిక్‌గా వ్యవహరిస్తున్నారనే నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వీక్షకుల చూపును తన వైపు మళ్లించుకునేలా, సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ అయ్యేలా చేస్తోన్న ప్రయత్నాలు.. సహజత్వాన్ని రిఫ్లెక్ట్ చేయలేదని చెబుతున్నారు.

ప్రియ-యంకర్ రవి-లహరి ట్రయాంగిల్ ఎపిసోడ్

ప్రియ-యంకర్ రవి-లహరి మధ్య సాగిన ట్రయాంగిల్ ఎపిసోడ్‌లో చివరికి లహరికి శుభంకార్డు పడనుంది. శనివారం నాటి ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున ఇచ్చిన ప్రియ-యాంకర్ రవిల వర్షన్ విన్న తరువాత- లహరికి హగ్ ఆప్షన్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరిలో ఆమె ప్రియను హగ్ చేసుకుంటుంది. అప్పటిదాకా చేసిన కామెంట్స్ అన్నీ మరిచిపోయి- తన వెనుక మాట్లాడాడనే కారణంతో యాంకర్ రవితో విభేదించడం సరికాదనే అభిప్రాయాలు నెటిజన్ల నుంచి వ్యక్తమౌతోన్నాయి.

లోబోపై నెటిజన్లు ఫైర్

లహరి వేసుకునే డ్రెస్‌లపై వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేసిన లోబో పట్ల నెటిజన్లు భగ్గుమంటున్నారు. మహిళలు వేసుకునే డ్రెస్‌ను ఆధారంగా చేసుకుని- వారి మనస్తత్వాన్ని, వైఖరిని అంచనా వేయడం సరికాదని మండిపడుతున్నారు. లహరి వేసుకునే దుస్తులు.. తనను అదుపు తప్పేలా చేస్తోన్నాయంటూ లోబో కామెంట్స్ చేయడాన్ని తప్పుపడుతున్నారు. మహిళల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అతను కామెంట్స్ చేశాడని ధ్వజమెత్తుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+