Big Boss Telugu 5: కంటెస్టెంట్‌గా ట్రాన్స్‌జెండర్: అతడు నుంచి ఆమెగా: వారికి స్ఫూర్తి
హైదరాబాద్: బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 అదరగొడుతోంది. ఫస్ట్ ఎపిసోడ్‌తోనే కలర్‌ఫుల్‌గా మారింది. టీవీక్షకులను కట్టి పడేసింది. మరో ఛానల్ తిప్పనివ్వకుండా చేసింది. కంటెస్టెంట్లతో బిగ్‌బాస్ హౌస్ సందడిగా మారింది. ఎప్పట్లాగే ఈ సారి కూడా వేర్వేరు రంగాలకు చెందిన కంటెస్టెంట్లతో బిగ్ బాస్ హౌస్ కోలాహలంగా మారింది. డిఫరెంట్ సెక్టార్స్, డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారందరూ ఒకచోటికి చేరారు. ఒక్క టైటిల్ కోసం పోటీ పడుతోన్నారు. వారిలో విన్నర్ ఎవరనేది తెలియాలంటే వంద రోజుల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది..మరి.
ఈ సారి ట్రాన్స్‌జెండర్ యాక్ట్రెస్ ప్రియాంక సింగ్.. తొమ్మిదో కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టారు. నిజానికి ప్రియాంక సింగ్ ట్రాన్స్‌విమెన్. అసలు పేరు తేజ. అతడు నుంచి ఆమెగా మారారు. సెక్స్ ఛేంజ్ ఆపరేషన్ చేయించుకోవడం ద్వారా తేజ నుంచి ప్రియాంక సింగ్‌గా మారారు. ప్రియాంక సింగ్‌గా బుల్లితెరపై సెటిల్ అయ్యారు. బిగ్‌బాస్ డయాస్ మీదికి వచ్చిన తరువాత ప్రియాంక సింగ్ భావోద్వేగానికి గురయ్యారు. హోస్ట్ అక్కినేని నాగార్జున సాక్షిగా.. తాను ఎందుకు సెక్స్ రీఅసైన్‌మెంట్ ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చిందనే విషయాన్ని వివరించారు.
తండ్రి తప్ప కుటుంబ సభ్యులందరూ తనను మహిళగా యాక్సెప్ట్ చేశారని చెప్పారు ప్రియాంక సింగ్. తాను లింగమార్పిడి చేయించుకోవడాన్ని తండ్రి ఇంకా అంగీకరించలేకపోతోన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రికి తాను ఎప్పటికీ తేజగానే ఉంటానని, కోట్లాదిమంది టీవీ వీక్షకుల సమక్షంలో తాను ప్రామిస్ చేస్తున్నానని చెప్పారు. సమాజానికి భయపడి ఎందరో ట్రాన్స్‌జెండర్లు జీవిస్తున్నారని, వారికి స్ఫూర్తిగా నిలవాలనే తన లక్ష్యం.. బిగ్‌బాస్‌తో నెరవేరుతుందని అన్నారు.

పదో కంటెస్టెంట్‌గా షణ్ముఖ్ జస్వంత్ డయాస్ మీదికి వచ్చారు. మహేష్ బాబు నటించిన వన్ మూవీలోని హు ఆర్ యూ అనే పాటకు అదరగొట్టే స్టెప్స్‌తో ఆలరించాడు. తన జీవితంలో కొన్ని రిగ్రెస్ట్ ఉన్నాయని చెప్పుకొచ్చాడతను. ఈ ఏడాది మార్చిలో అతను డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పోలీసులకు దొరికిన విషయం తెలిసిందే. మద్యం మత్తులో కారును డ్రైవ్ చేస్తూ.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో బీభత్సం సృష్టించాడు. అతని ర్యాష్ డ్రైవింగ్ వల్ల రెండు కార్లు, రెండు బైక్స్ ధ్వంసం అయ్యాయి. ఈ కేసులో షణ్ముఖ్ జస్వంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు.












Click it and Unblock the Notifications