Bigg Boss 6 Telugu: యాంకర్ రష్మీ-సుడిగాలి సుధీర్ హాట్ కాంబో: కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే: మళ్లీ రచ్చ

హైదరాబాద్: తెలుగులో 15 వారాల పాటు కొనసాగిన బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో.. బిగ్‌బాస్ సీజన్ 5 సందడి ముగిసింది. ఈ సీజన్ టైటిల్ కోసం పోటీ పడిన టాప్ 5 కంటెస్టెంట్లు.. రోజూ వార్తల్లో నిలుస్తోన్నారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటోన్నారు. అనారోగ్య కారణాలతో 10వ వారంలో బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన జెస్సీ అలియాస్ జశ్వంత్ పడాల.. హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఎర్రర్ 500 అనే మూవీలో లీడ్ క్యారెక్టర్‌లో నటిస్తోన్నారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది కూడా.

మెగా కాంపౌండ్‌లో..

మెగా కాంపౌండ్‌లో..

టాప్ 3లో నిలిచిన ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్ర బంపర్ ఆఫర్‌ను సాధించాడు. ఏకంగా మెగా కాంపౌండ్‌లోకి అడుగు పెట్టాడు. అల్లు అరవింద్‌కు చెందిన ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఆహాలో బిగ్గెస్ట్ స్టేజ్ షోను నిర్వహించబోతోన్నాడు. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. సుదీర్ఘకాలం పాటు సాగే స్టేజ్ షో ఇది. బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన వారం రోజుల వ్యవధిలోనే ఓ గొప్ప అవకాశాన్ని అందుకున్నాడు.

అప్పుడే సీజన్ 6 రెడీ..

అప్పుడే సీజన్ 6 రెడీ..

ఈ సందడి ముగిసీ, ముగియకముందే బిగ్‌బాస్ సీజన్ 6 మొదలైనట్టే కనిపిస్తోంది. ఈ దఫా ఫిబ్రవరిలోనే బిగ్‌బాస్ సీజన్ ఆరంభమౌతుందంటూ ఇదివరకే హోస్ట్ అక్కినేని నాగార్జున కూడా హింట్ ఇచ్చారు. ఇప్పటిదాకా టెలికాస్ట్ అయిన సీజన్లకు డిఫరెంట్‌గా ఇది ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌పై ప్రసారం కానుందనే ప్రచారం ఉంది. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌‌లో ఇది ప్రసారం అయ్యే ఛాన్స్ ఉంది. ఓటీటీ కావడం వల్ల బిగ్‌బాస్ షోనకు బ్రేక్ ఉండదు. 24/7 టెలికాస్ట్ అవుతుంది.

50 రోజుల్లో పూర్తి..

50 రోజుల్లో పూర్తి..

ఈ బిగ్‌బాస్ సీజన్.. 50 రోజులు మాత్రమే ఉంటుందని చెబుతున్నారు. గ్రాండ్ ఫినాలెతో కలుపుకొని 50 రోజుల్లో దీన్ని ముగించేలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రైజ్ మనీ కూడా తక్కువే ఉంటుందనే ప్రచారం సాగుతోంది. బిగ్‌బాస్ సీజన్ 5 విన్నర్‌కు 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ ఇచ్చారు నిర్వాహకులు. ఈ దఫా ఈ మొతాన్ని 25 లక్షల రూపాయలకే కుదిస్తారని అంటున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఓ పైలెట్ ప్రాజెక్ట్‌గా దీన్ని చేపట్టనున్నారని, ఇది సక్సెస్‌ అయితే- ఓటీటీలోనే అన్ని సీజన్లు టెలికాస్ట్ అయ్యేలా చర్యలు తీసుకుంటారని సమాచారం.

కంటెస్టెంట్ల సంఖ్య కూడా తక్కువే..

కంటెస్టెంట్ల సంఖ్య కూడా తక్కువే..

ఈ దఫా బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు టైటిల్ కోసం పోటీ పడే కంటెస్టెంట్ల సంఖ్యను కూడా పరిమితం చేసినట్లు తెలుస్తోంది. సీజన్ 5లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లను సెలెక్ట్ చేశారు. అప్ కమింగ్ సీజన్ కోసం ఎనిమిది నుంచి 10 మంది వరకు మాత్రమే కంటెస్టెంట్లు ఉండేలా చూస్తున్నారని, అందుకే- జాగ్రత్తగా ఈ లిస్ట్‌ను ప్రిపేర్ చేస్తున్నారని చెబుతున్నారు. ఇది సక్సెస్ అయితే- సీజన్ 7 నుంచి మళ్లీ పూర్తిస్థాయిలో దీన్ని నిర్వహిస్తారని, ఓటీటీలోనే టెలికాస్ట్ చేస్తారనే ప్రచారం ఉంది.

కంటెస్టెంట్లు వీరే..

కంటెస్టెంట్లు వీరే..

రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున.. నిర్వాహకులు కంటెస్టెంట్లను కూడా సెలెక్ట్ చేశారనే ప్రచారం సాగుతోంది. ఈ జాబితాలో పేరున్న సెలెబ్రిటీస్‌లే కనిపిస్తోన్నారు. ఆమె కథ, వాణి రాణి సీరియల్స్‌తో ప్రేక్షకులకు చేరువైన నటి నవ్య స్వామి, టాప్ డీజే కమ్ నటుడు బబ్లూ, జబర్దస్త్ సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రత్యూష, సరిలేరు నీకెవ్వరు ఫేమ్ సేతురామన్, యూట్యూబర్ పృథ్వీ, యాంకర్లు వర్షిణి, శివ, నటి సురేఖ వాణి, జబర్దస్త్ దొరబాబు, ఢీ ఫేమ్ డాన్సర్ రాజు సెలెక్ట్ అయ్యారని అంటున్నారు. ఈ జాబితాలో కొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+