Bigg Boss Telugu 7: హౌస్‌లో మరో టాప్ లెస్ మోడల్..!!
హైదరాబాద్: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఇంటింటినీ పలకరించింది. కొద్దిసేపటి కిందటే బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్‌గా ఆరంభమైంది. ఉల్టా పుల్టా సీజన్ కావడం వల్ల అన్నీ ప్రత్యేకతలే కనిపించాయి బిగ్ బాస్ హౌస్‌లో. హౌస్ మేట్స్ సెలెక్షన్ కూడా డిఫరెంట్‌గా ఉంది.
తొలి కంటెస్టెంట్‌గా సీరియల్ నటి ప్రియాంక జైన్.. డయాస్‌పైకి వచ్చారు. పొట్టి పిల్ల అనే సాంగ్‌కు అదరగొట్టేలా డాన్స్ చేశారు. హౌస్‌లో ఆమెనే మొట్టమొదటి సారిగా అడుగు పెట్టారు కూడా. బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందనేది ఇంట్రడ్యూస్ చేశారు. బ్రహ్మాస్త్రాన్ని దక్కించుకుంటేనే ఆమె బిగ్ హౌస్ కంటెస్టెంట్‌గా కొనసాగుతారు.

రెండో కంటెస్టెంట్‌గా నటుడు శివాజీ బిగ్ బాస్ డయాస్ మీద గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్‌కు ఎలా సెలెక్ట్ అయ్యాడో చెప్పుకొచ్చారు. సినిమాల్లో నటించాలనే ఉద్దేశం తనకు లేదని, బతకడానికి హైదరాబాద్‌కు వచ్చి సినీ ఫీల్డ్‌లోకి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తన బతుకు ఉల్టా అయిందంటూ నవ్వుతూ కామెంట్ చేశారు.
వారిద్దరి తరువాత గాయని దామిని భాట్ల, మోడల్ ప్రిన్స్ యావర్, అడ్వొకేట్ కమ్ నటి శుభశ్రీ రాయగురు, సీనియర్ నటి షకీల, ఆట సందీప్, శోభా షెట్టి, టేస్టీ తేజ, రతిక రాస్, గౌతమ్ కృష్ణ, పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, అమర్‌దీప్ చౌదరి.. బిగ్ బాస్ హౌస్‌లో అడుగు పెట్టారు. మొత్తం 15 వారాల పాటు కొనసాగే సీజన్ ఇది.
ఈ సీజన్‌లో కూడా టాప్ లెస్‌గా ఓ కంటెస్టెంట్ కనిపించడం నెటిజన్ల చేతికి పని పెట్టింది. ప్రతి సీజన్‌లోనూ షర్ట్ విప్పి బేర్ బాడీ మీద తిరిగే ఓ కంటెస్టెంట్‌ను సెలెక్ట్ చేయడం నిర్వాహకులకు ఆనవాయితీగా మారిందంటూ సెటైర్లు వేస్తోన్నారు. ఇదివరకు ప్రిన్స్, సామ్రాట్, మెహబూబ్, అలీరెజా, విశ్వ, రోహిత్.. లిస్ట్‌లో ఇప్పుడు ప్రిన్స్ యావర్ కూడా చేరాడంటూ గుర్తు చేస్తోన్నారు.
ప్రిన్స్ యావర్‌కు తెలుగు రాదు. జన్మతః అతను బెంగాలీ. అతని స్వస్థలం కోల్‌కత. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తోన్నాడు. సెయింట్ జోసెఫ్ కాలేజీలో చదివాడు. 2017లో తొలిసారిగా యాక్టింగ్ రంగంలో అడుగుపెట్టాడు. చంద్రకాంత అనే హిందీ సీరియల్‌లో నటించాడు. ఆ తరువాత నా పేరు మీనాక్షి అనే సీరియల్ మెరిశాడు. హిట్లర్ గారి పెళ్లాం, కలిసివుంటే కలదు సుఖం, అభిషేకం.. వంటి సీరియళ్లతో బిజీగా ఉంటోన్నాడు.












Click it and Unblock the Notifications