Bigg Boss Telugu 7: సమంత గురించి విజయ్ దేవరకొండను అడిగి తెలుసుకున్న నాగార్జున

హైదరాబాద్: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 త్వరలో ఇంటింటినీ పలకరించబోతోంది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి బిగ్ బాస్ సీజన్ 7 ఆరంభం కాబోతోంది.. గ్రాండ్‌గా. దీనికి సంబంధించిన లోగో ప్రోమో ఇదివరకే విడుదలైంది.

2017లో తొలిసారిగా తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మొదలైంది. నిరాటంకంగా కొనసాగుతూ వస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన పరిస్థితుల్లో కూడా దీనికి బ్రేక్ పడలేదు. తొలి సీజన్‌కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆ తరువాత ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నాడు.

Bigg boss telugu 7: host nagarjuna asked about ex daughter-in-law Samantha

ఆ సీజన్‌లో నటుడు శివబాలాజీ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. ఆదర్శ్ రన్నరప్. రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. సీజన్ 2లో కౌశల్ మందా విన్నర్. ప్లేబ్యాక్ సింగర్ గీతా మాధురి రెండో స్థానంలో నిలిచారు. మూడో సీజన్ నుంచి అక్కినేని అందగాడి హవా మొదలైంది.

2019 నాటి మూడో సీజన్‌లో నేపథ్య గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ విజేతగా ఆవిర్భవించాడు. టాప్ యాంకర్ శ్రీముఖి రెండో స్థానానికి పరిమితం అయ్యారు. నాలుగో సీజన్‌ టైటిల్‌ను అభిజిత్ ఎగరేసుకెళ్లాడు. అఖిల్ సార్థక్ రన్నరప్. ఆ తరువాతి సీజన్‌లో వీజే సన్నీ ఛాంపియన్ కాగా యూట్యూబర్ షణ్ముఖ్‌ది రెండోస్థానం.

ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఈ సాయంత్రం 7 గంటలకు గ్రాండ్‌గా ఆరంభం కాబోతోంది. దీనికి సంబంధించిన ప్రొమోను నిర్వాహకులు కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు. కలర్‌ఫుల్‌గా కనిపించిందీ ప్రొమో. నాగార్జున తనదైన స్టైల్‌లో అదరగొట్టాడు. ఉల్టా, పుల్టా అంటూ మెస్మరైజ్ చేశాడు. ఈ సీజన్‌ టైటిల్ కోసం పోటీ పడే కంటెస్టెంట్ల పేర్లు ఇంట్రెస్టింగ్ కలిగిస్తోంది.

Bigg boss telugu 7: host nagarjuna asked about ex daughter-in-law Samantha

శోభా షెట్టి, విష్ణుప్రియ, ఆటా సందీప్, అమర్‌దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణ, భోలే షావలి, ప్రత్యూష, షకీలా, టేస్టీ తేజా, మహేష్ ఆచంట, అంబటి అర్జున్, అపూర్వ, దామిని భాట్ల, ఫర్జానా, పల్లవి ప్రశాంత్, పూజా మూర్తి, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, శివాజీ, శుభశ్రీ రాయగురు బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లనున్నారు. చివరి నిమిషంలో ఇందులో మార్పులు చోటు చేసుకోవచ్చు.

ఈ మధ్యాహ్నం నిర్వాహకులు విడుదల చేసిన ఓ ప్రొమో.. ఈ సీజన్‌పై మరింత ఆసక్తి కలిగించింది. లాంచింగ్ ఎపిసోడ్‌లో చీఫ్ గెస్టులుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి మెరుపులు మెరిపించనున్నారు. తన మాజీ కోడలు సమంత గురించి విజయ్ దేవరకొండ వద్ద నాగార్జున ఆరా తీయడం కనిపించింది. దీనికి అతని ఎలాంటి సమాధానం వచ్చిందనేది ఫుల్ ఎపిసోడ్‌లో చూడొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+