Bigg Boss Telugu 7: ఏ కంటెస్టెంట్ కన్‌ఫర్మ్ కాలేదు- బిగినింగ్‌లోనే ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చిన నాగ్
హైదరాబాద్: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఇంటింటినీ పలకరించింది. ఇవ్వాళ బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్‌గా ఆరంభమైంది. దీనికి సంబంధించిన లోగో ప్రోమో ఇదివరకే విడుదలైంది.
2017లో తొలిసారిగా తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సందడి మొదలైంది. నిరాటంకంగా కొనసాగుతూ వస్తోంది.
తొలి సీజన్‌కు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆ తరువాత ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నాడు. ఆ సీజన్‌లో నటుడు శివబాలాజీ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు. ఆదర్శ్ రన్నరప్. రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించాడు. సీజన్ 2లో కౌశల్ మందా విన్నర్. ప్లేబ్యాక్ సింగర్ గీతా మాధురి రెండో స్థానంలో నిలిచారు. మూడో సీజన్ నుంచి అక్కినేని అందగాడి హవా మొదలైంది.

2019 నాటి మూడో సీజన్‌లో నేపథ్య గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ విజేతగా ఆవిర్భవించాడు. టాప్ యాంకర్ శ్రీముఖి రెండో స్థానానికి పరిమితం అయ్యారు. నాలుగో సీజన్ టైటిల్‌ను అభిజిత్ ఎగరేసుకెళ్లాడు. అఖిల్ సార్థక్ రన్నరప్. ఆ తరువాతి సీజన్‌లో వీజే సన్నీ ఛాంపియన్ కాగా యూట్యూబర్ షణ్ముఖ్‌ది రెండోస్థానం.
ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఈ సాయంత్రం 7 గంటలకు గ్రాండ్‌గా ఆరంభమైంది. దీనికి సంబంధించిన ప్రొమోను నిర్వాహకులు కొద్దిసేపటి కిందటే విడుదల చేశారు. కలర్‌ఫుల్‌గా కనిపించిందీ ప్రొమో. నాగార్జున తనదైన స్టైల్‌లో అదరగొట్టాడు. ఉల్టా, పుల్టా అంటూ మెస్మరైజ్ చేశాడు. ఈ సీజన్ టైటిల్ కోసం పోటీ పడే కంటెస్టెంట్ల పేర్లు ఇంట్రెస్టింగ్ కలిగించింది.
లాంచింగ్ ఎపిసోడ్‌లోనే బాంబు పేల్చారు నాగార్జున. ఇప్పటివరకు ఏ కంటెస్టెంట్ కూడా కన్‌ఫర్మ్ కాలేదనీ తేల్చి చెప్పారు. ఉల్టా పుల్టా సీజన్ కావడం వల్ల బిగ్ బాస్ ఇచ్చే బ్రహ్మాస్త్రాన్ని అందుకుంటేనే హౌస్‌లోకి వెళ్లగలరనీ స్పష్టం చేశారు. దాన్ని దక్కించుకున్న వారే హౌస్ మేట్స్ అవుతారని పేర్కొన్నారు.
తొలి కంటెస్టెంట్‌గా సీరియల్ నటి ప్రియాంక జైన్.. డయాస్‌పైకి వచ్చారు. పొట్టి పిల్ల అనే సాంగ్‌కు అదరగొట్టేలా డాన్స్ చేశారు. హౌస్‌లో ఆమెనే మొట్టమొదటి సారిగా అడుగు పెట్టారు కూడా. బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందనేది ఇంట్రడ్యూస్ చేశారు. బ్రహ్మాస్త్రాన్ని దక్కించుకుంటేనే ఆమె బిగ్ హౌస్ కంటెస్టెంట్‌గా కొనసాగుతారు.












Click it and Unblock the Notifications