Bigg Boss Telugu 7: సమంతపై నాగార్జునకు విజయ్ దేవరకొండ ఏం చెప్పాడంటే..?
హైదరాబాద్: టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఇంటింటినీ పలకరించింది. కొద్దిసేపటి కిందటే బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్‌గా ఆరంభమైంది. ఉల్టా పుల్టా సీజన్ కావడం వల్ల అన్నీ ప్రత్యేకతలే కనిపించాయి బిగ్ బాస్ హౌస్‌లో. హౌస్ మేట్స్ సెలెక్షన్ కూడా డిఫరెంట్‌గా ఉంది.
తొలి కంటెస్టెంట్‌గా సీరియల్ నటి ప్రియాంక జైన్.. డయాస్‌పైకి వచ్చారు. పొట్టి పిల్ల అనే సాంగ్‌కు అదరగొట్టేలా డాన్స్ చేశారు. హౌస్‌లో ఆమెనే మొట్టమొదటి సారిగా అడుగు పెట్టారు కూడా. బిగ్ బాస్ హౌస్ ఎలా ఉందనేది ఇంట్రడ్యూస్ చేశారు. బ్రహ్మాస్త్రాన్ని దక్కించుకుంటేనే ఆమె బిగ్ హౌస్ కంటెస్టెంట్‌గా కొనసాగుతారు.

రెండో కంటెస్టెంట్‌గా నటుడు శివాజీ బిగ్ బాస్ డయాస్ మీద గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్‌కు ఎలా సెలెక్ట్ అయ్యాడో చెప్పుకొచ్చారు. సినిమాల్లో నటించాలనే ఉద్దేశం తనకు లేదని, బతకడానికి హైదరాబాద్‌కు వచ్చి సినీ ఫీల్డ్‌లోకి రావాల్సి వచ్చిందని పేర్కొన్నారు. తన బతుకు ఉల్టా అయిందంటూ నవ్వుతూ కామెంట్ చేశారు.
వారిద్దరి తరువాత గాయని దామిని భాట్ల, మోడల్ ప్రిన్స్ యావర్, అడ్వొకేట్ కమ్ నటి శుభశ్రీ రాయగురు, సీనియర్ నటి షకీల, ఆట సందీప్, శోభా షెట్టి, టేస్టీ తేజ, రతిక రాస్, గౌతమ్ కృష్ణ, పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, అమర్‌దీప్ చౌదరి.. బిగ్ బాస్ హౌస్‌లో అడుగు పెట్టారు. మొత్తం 15 వారాల పాటు కొనసాగే సీజన్ ఇది.
కంటెస్టెంట్లను ఇంట్రడ్యూస్ చేసే ఈ ఎపిసోడ్‌కు విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. ఖుషీలోని ఆరాధ్య.. హిట్ ట్రాక్‌కు డాన్స్ చేశాడు. ఫుల్ ఎనర్జిటిక్‌గా కనిపించాడు. నాగార్జున కోరిక మేరకు బిగ్ బాస్ హౌస్‌లోకీ ఎంటర్ అయ్యాడు. తనకు ఇచ్చిన టాస్క్‌ను కంప్లీట్ చేసుకుని బయటికొచ్చాడు.
ఈ సందర్భంగా వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఆసక్తి కలిగించింది. మాజీ కోడలు సమంత గురించి నాగార్జున విజయ్ దేవరకొండను అడగడం ఇంట్రెస్టింగ్ అనిపించింది. నీ హీరోయిన్ సమంత ఎక్కడ?, ఖుషీ సినిమా ప్రమోషన్స్‌లో కనిపించట్లేదని అడగ్గా.. ప్రస్తుతం ఆమె అమెరికా వెళ్లినట్లు విజయ్ దేవరకొండ రిప్లై ఇచ్చాడు. అనారోగ్యం వల్ల ప్రమోషన్స్‌కు రావట్లేదని చెప్పాడు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications