క్యాంపు రాజకీయాలకు కేంద్రంగా హైదరాబాద్: ఇప్పుడు బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

హైదరాబాద్ క్యాంపు రాజకీయాలకు కేంద్రంగా మారుతోంది. ఇవాళే జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి రాంచీకి బయల్దేరారు. అయితే, ఈసారి బీహార్ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు వచ్చారు. ఇటీవల ఇండియా కూటిమిని వీడిన జేడీయూ అగ్రనేత నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమికి చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12న బీహార్ రాష్ట్రంలోని జేడీయూ-బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనుంది. ఈ రెండు పార్టీలకు ఎన్డీఏ కూటమి పార్టీలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం ఉంది. అయినప్పటికీ.. తమ ఎమ్మెల్యేలను బీజేపీ-జేడీయూ తమవైపు తిప్పుకుంటుందేమోనని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలోనే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రమైన తెలంగాణకు తరలించింది.

bihar congress sent 18 party mlas to hyderabad amid assembly floor test on 12th feb

బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వీరిలో 18 మందిని హైదరాబాద్‌కు పంపింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి వీరు హైదరాబాద్‌కు ఆదివారం రాత్రి చేరుకున్నారు. అయితే, మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే అన్వరుల్ హక్ మాత్రం వ్యక్తిగత కారణాలతో ఢిల్లీలోనే ఉండిపోయారు. బీహార్ కాంగ్రెస్ అధ్యక్షుడు అఖిలేష్ సింగ్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మదన్మోహన్ ఝా కూడా హైదరాబాద్‌కు తరలివచ్చారు.

కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకోగానే.. వారిని నగర శివార్లలోని ఇబ్రహీంపట్నంలోని ఓ రిసార్టుకు తరలించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ సీఎం, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఏఐసీసీ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందినట్లు సమాచారం. హైదరాబాద్ వచ్చిన బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ బల పరీక్షకు గంటల ముందే ఇక్కడ్నుంచి బీహార్ వెళ్లే అవకాశం ఉంది.

కాగా, బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలుండగా.. మెజార్టీకి 122 ఎమ్మెల్యేల బలం అవసరం ఉంది. అయిేత, బీజేపీకి 78 మంది, జేడీయూకు 45 మంది, కాంగ్రెస్ 19, లెఫ్ట్ పార్టీలు 16, హెచ్ఏఎం 4, ఎఐఎం 1, ఇండిపెండెంట్ 1 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమికి బీహార్‌లో 127 మంది బలం ఉంది. దీంతో బలపరీక్ష నెగ్గడం బీజేపీ కూటమికి ఇతర ఎమ్మెల్యేల అవసరం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+