క్లైమాక్స్: హైదరాబాద్ నుంచి తరలి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
Bihar floor test: బిహార్ రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్)- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వానికి బల నిరూపణలకు ఒక్క రోజే మిగిలివుంది. ఈ కూటమి ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం శాసనసభలో బల పరీక్షను ఎదుర్కొననున్నారు.
కిందటి నెలలో జేడీయూ- రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ మహా ఘట్‌బంధన్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఎన్డీఏ కూటమిలో చేరారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తనకు మద్దతు ఇవ్వనున్న జేడీయూ, బీజేపీ- దాని మిత్రపక్షాల శాసన సభ్యుల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్‌కు అందజేశారు.

243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 122. జేడీయూకు 45 స్థానాలు ఉన్నాయి. బీజేపీకి ఉన్న 78, దాని మిత్రపక్షం హిందుస్తాన్ ఆవామీ లీగ్-4 స్థానాలను కలుపుకొంటే ఈ మేజిక్ ఫిగర్‌ను అందుకోగలుగుతుంది.
జేడీయూ, బీజేపీ, ఆవామీ లీగ్‌కు చెందిన 127 మంది సభ్యులు.. నితీష్ కుమార్ నాయకత్వాన్ని సమర్థించారు. ఆయనకు మద్దతుగా లేఖలు ఇచ్చారు. దీనితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్డీఏను ఆహ్వానించారు గవర్నర్. తొమ్మిదో సారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారాయన.
సభలో తన బలాన్ని నిరూపించుకోవడానికి గవర్నర్ 10 రోజులు గడువు ఇచ్చిన నేపథ్యంలో.. సోమవారం తన ఫ్లోర్ టెస్ట్‌ను ఎదుర్కొనబోతోన్నారాయన. ఎన్డీఏ ప్రభుత్వానికి బొటాబొటి మెజారిటీ కావడం వల్ల ఈ నేపథ్యంలో బిహార్ రాజకీయాలపై ఉత్కంఠత నెలకొంది.
తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ.. వారందరినీ అప్పట్లోనే హైదరాబాద్‌కు పంపించింది. ఈ 10 రోజుల పాటు షామీర్ పేట్‌లోని రిసార్టులో గడిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కొద్దిసేపటి కిందటే శంషాబాద్ విమానాశ్రయ నుంచి పాట్నాకు బయలుదేరి వెళ్లారు. వారంతా బలపరీక్షలో పాల్గొంటారు.
-
మందుబాబులకు బిగ్ షాక్.. రేపు వైన్ షాప్ లు బంద్.. -
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications