బెంగళూరు వద్దు.. హైదరాబాద్ ముద్దు..! కారణం ఇదేనట..?

అమెరికాకు చెందిన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. నెట్ ఫ్లిక్స్ కు ప్రపంచంలోని పలు దేశాల్లో ఆఫీస్ లు ఉన్నాయి. మన దేశంలో తొలిసారిగా ముంబైలో నెట్ ఫ్లిక్స్ ఆఫీస్ ను ప్రారంభించింది. అయితే దేశంలో రెండో కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ నగరాన్ని ఎంచుకుంది. హైదరాబాద్ లో నెట్ ఫ్లిక్స్ భారీ స్థాయిలో ఆఫీస్ ను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు హైటెక్ సిటీలో 41, 000 స్క్వేర్ ఫూట్ స్థలాన్ని లీజుకు తీసుకుంది.

నెట్ ఫ్లిక్స్ సంస్థకు ప్రస్తుతం భారత్ లో ముంబైలో మాత్రమే కార్యాలయం ఉంది. దీంతో తన రెండో కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ ను ఎంచుకుంది. హైదరాబాద్ లోని హెటెక్ సిటీలో 41,000 చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. వార్నర్ బ్రోస్ సంస్థకు చెందిన డిస్కవరీ ఇండియా కార్యాలయం ఉన్న భవనంలోనే త్వరలో నెట్ ఫ్లిక్స్ కార్యాలయం ప్రారంభం కానున్నట్లు సినీజోష్ అనే న్యూస్ ఛానెల్ స్పష్టం చేసింది.

నెట్ ఫ్లిక్స్ హైదరాబాద్ ఆఫీస్ లో రీజినల్ కంటెంట్ లో ప్రావీణ్యం పొందిన టీమ్స్ ను ఏర్పాటు చేయనుంది. రీజినల్ కంటెంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్స్ ను సూపర్ విజన్ చేయడం.. టెక్నికల్ వర్క్ ఫ్లో, ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ ఆపరేషన్ లో వెండర్ మేనేజ్ మెంట్.. తదితర కార్యక్రమాలకు నిలయంగా మారనుంది. హైదరాబాద్ లోని గ్లోబల్ కేపబులిటీ సెంటర్(GCC) లో నెట్ ఫ్లిక్స్ తో పాటు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు అయిన మెక్ డొనాల్డ్స్, ఎలీ లిల్లీ సంస్థలు కార్యకలాపాలను ప్రారంభించాయి.

హైదరాబాద్ vs బెంగళూరు

అయితే భారత్ లో తమ రెండో కార్యాలయాన్ని హైదరాబాద్ లో స్టార్ట్ చేయబోతున్నట్లు నెట్ ఫ్లిక్స్ నుంచి ప్రకటన రాగానే హైదరాబాద్ vs బెంగళూరు అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. లైవ్ డిబేట్లు జరిగాయి. బెంగళూరుకు కూడా భారత్ టెక్ హబ్ ప్రాంతంగా పేరుంది. ప్రపంచ స్థాయి కంపెనీలు అయిన గూగుల్, ఇన్ ఫోసిస్, విప్రో, టీసీఎస్, మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఉన్నాయి. ఈ క్రమంలో నెట్ ఫ్లిక్స్ హైదరాబాద్ ను ఎంచుకోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Binge on the Bay Netflix Picks Hyderabad Over Bengaluru Sparking Pothole Panic Online

ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల్లో పలు కామెంట్స్ వినిపిస్తున్నాయి. బెంగళూరులో ట్రాఫిక్, గుంతలు కారణంగా పలు అంతర్జాతీయ సంస్థలు ఇతర నగరాలను ఎంచుకుంటున్నట్లు ఓ యూజర్ ఎక్స్ లో పోస్టు పెట్టాడు. అక్కడ అధికారంలో ఉన్నవాళ్లు నిద్ర పోతున్నారని కామెంట్ పెట్టాడు. మరికొంత మంది మాత్రం అభివృద్ది మొత్తం ఒకే ప్రాంతంలో జరిగితే లాభం లేదని మిగతా నగరాలకూ విస్తరించాలని కామెంట్స్ చేశాడు. మరో వ్యక్తి మాత్రం.. హైదరాబాద్ లో ఆఫీస్ ఉన్నా.. మైండ్స్ మొత్తం బెంగళూరులో ఉన్నాయని.. ముంబైలో మనీ ఉందని.. దిల్లీలో పవర్ ఉందని కామెంట్ పెట్టాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+