హైదరాబాద్ నుంచి మరో కరోనా టీకా: ‘బయోలాజికల్ ఈ’ వ్యాక్సిన్ 3వ దశ ట్రయల్స్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: నగరంలోని బయోలాజికల్ ఈ లిమిటెడ్(బీఈ) ఇప్పటికే తన కోవిడ్ 19 వ్యాక్సిన్ సుబునిత్/సబ్యూనిట్ వ్యాక్సిన్ తొలి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. తాజాగా, ఈ వ్యాక్సిన్ క్యాండిడేట్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీవో) సబ్జెక్ట్ నిపుణుల కమిటీ(ఎస్ఈసీ) నుంచి ఆమోదం లభించింది.

గత నవంబర్‌లోనే తొలి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం..
నవంబర్ 2020లోనే బయోలాజికల్ ఈ తన కరోనా వ్యాక్సిన్ తొలి, రెండో దశ క్లినియకల్ ట్రయల్స్ ప్రారంభించింది. ఈ రెండు దశల్లోనూ ఆశించిన ఫలితాలను రాబట్టింది. ఇక మూడో దశ క్లినికల్ ట్రయల్స్ దేశంలోని 15 ప్రాంతాల్లో చేపట్టనుంది.
ఇది 18 నుంచి 80 సంవత్సరాల వయస్సులో 1,268 ఆరోగ్యకరమైన విషయాలలో వ్యాధి నుంచి రక్షణ కోసం బయోలాజికల్ ఈ తన సార్స్-కోవ్-2 కోవిడ్ 19 టీకా రోగనిరోధక శక్తిని, భద్రతను అంచనా వేస్తుంది. ఇది పెద్ద గ్లోబల్ ఫేజ్ III అధ్యయనంలో భాగం కావడానికి ఉద్దేశించబడింది.

బయోలాజికల్ ఈ నుంచి మరో సమర్థవంతమైన కరోనా వ్యాక్సిన్
బయోలాజికల్ ఈ వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమని, రోగనిరోధక శక్తిని భారీగా పెంచుతోందని తొలి, రెండో దశల ప్రయోగాల్లో నిరూతమైనట్లు సంస్థ తెలిపింది. ప్రయాగాల్లో భాగంగా రెండు డోసుల వ్యాక్సిన్‌ను 28 రోజుల వ్యవధిలో ఇచ్చినట్లు తెలిపింది. ఈ ఫలితాలను తమకు చాలా ఆనందం కలిగించినట్లు బీఈ ఎండీ మహిమా దాట్ల తెలిపారు. కరోనాపై పోరులో తమది కూడా మరో సమర్థవంతమైన వ్యాక్సిన్ అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

నెలకు 7 వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం బీఈ సొంతం
బీఈ అభివృద్ధి చేస్తున్న ఈ వ్యాక్సిన్ వచ్చే ఆగస్టు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. నెలకు 7 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యం బయోలాజకిల్ ఈకి ఉండటం గమనార్హం. ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది. కాగా, ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కోవాగ్జిన్, రెమిడిసివిర్ టీకాలు ఉత్పత్తి అవుతుండగా.. ఇప్పుడు బయోలాజికల్ ఈ కూడా వ్యాక్సిన్ అందుబాటులో తెస్తుండటం నగరానికి గర్వకారణంగా మారనుంది.

జాన్సన్ అండ్ జాన్సన్‌తో కలిసి బీఈ మరో వ్యాక్సిన్ తయారీ
అంతేగాక, బయోలాజికల్ ఈ మరో వ్యాక్సిన్ ను కూడా తయారు చేయబోతోంది. క్వాడ్ వ్యాక్సిన్ భాగస్వామ్యంలో భాగంగా అమెరికాలోని జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను బయోలాజికల్ ఈ ఉత్పత్తి చేయనుంది. 2022 డిసెంబర్ నాటికి బీఈ ద్వారా 100 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని అమెరికన్ సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications