40ల్లోకి అడుగుపెట్టబోతున్నారు.. : "ఫ్లాష్ బ్యాక్ లో కేటీఆర్"

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/పూరి : రాజకీయాల్లో వారసత్వాలు ప్లాట్ ఫామ్ ను మాత్రమే క్రియేట్ చేయగలవు గానీ భవిష్యత్తు రాజకీయాన్ని నిర్ణయించలేవు. ఒక్కసారి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించాక.. మాట తీరు దగ్గరి నుంచి వ్యవహార శైలి వరకు ప్రతీ విషయాన్ని జనం గమనిస్తారు. ఆకట్టుకునే మాటతీరు, అందరినీ మెప్పించే పనితనం, ముందుచూపుతో కూడిన ప్రణాళికలు ఆయా నేతలకు మాస్ ఇమేజ్ ను క్రియేట్ చేస్తాయి.

తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రస్తుత మంత్రి కేటీఆర్ ఇదే పంథాను ఫాలో అవుతున్నారు. ఆయన రాజకీయ ప్రవేశం వారసత్వంగానే జరిగినా.. ప్రజల్లో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకుని, తనదైన మార్క్ రాజకీయాలతో సాగిపోతున్నారు కేటీఆర్. ఆదివారంతో ఆయన 40వ వడిలోకి అడుగుపెడుతుండడంతో.. కేటీఆర్ లైఫ్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం.. స్లైడ్స్ లో

ఏడు స్కూల్స్ మారారు..

ఏడు స్కూల్స్ మారారు..

కరీంనగర్ లో పుట్టిన కేటీఆర్ తాను 3వ తరగతిలో ఉన్నప్పుడు హైదరాబాద్ కు మారింది కుటుంబం. ఆ తర్వాత పదేళ్ల కాలంలో.. ఒక స్కూల్ నుంచి మరో స్కూల్ కు అలా మొత్తం 7 స్కూల్స్ మారారు కేటీఆర్.

రెండు మాస్టర్ డిగ్రీలు : పూణే యూనివర్సిటీ నుంచి ఎం.ఎస్సీ

రెండు మాస్టర్ డిగ్రీలు : పూణే యూనివర్సిటీ నుంచి ఎం.ఎస్సీ

బయోటెక్నాలజీలో పీజీ పూర్తి చేశారు కేటీఆర్. అనంతరం యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి ఎంబీఏ ఇన్ మార్కెటింగ్ అండ్ ఈ కామర్స్ లో మరో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు.

సేల్స్ డైరెక్టర్ గా

సేల్స్ డైరెక్టర్ గా

విద్యాభ్యాసం అనంతరం అమెరికాలోని INTTRA లో రీజినల్ సేల్స్ డైరెక్టర్ గా పనిచేశారు కేటీఆర్. 2006లో ఆయన పూర్తి స్థాయి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

ఎమ్మెల్యే గా

ఎమ్మెల్యే గా

సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తొలిసారి 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు కేటీఆర్. ఆ తర్వాత అదే నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు.

సైకతశిల్పం

సైకతశిల్పం

ఆదివారం నాడు కేటీఆర్ బర్త్ డే కావడంతో.. ప్రముఖ సైకత శిల్పకారుడు ప్రైడ్ ఆఫ్ ఒడిశా మనస్ కుమార్ సాహూ కేటీఆర్ శిల్పాన్ని పూరీ బీచ్ లో ఇసుకతో రూపుదిద్దారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Its about KTR.. On sunday he is stepping into 40 years. On this occassion its a short story on his life travel

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి