ఇక మీ నేతలు ఎందుకు: ఎమ్మెల్యేకు షాకిచ్చిన రైతులు, చేదు అనుభవం
హైదరాబాద్: పెద్దపల్లి శాసన సభ్యుడు మనోహర్ రెడ్డికి సంక్రాంతి రోజున చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందజేయాలని డిమాండ్ చేస్తూ గంగారం గ్రామరైతులు ఆయనను అడ్డుకున్నారు.
సోమవారం సాయంత్రం కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామంలో ఓ దేవాలయంలో పూజలు చేసేందుకు ఆయన వెళ్లారు. ఈ సమయంలో ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన కొందరు రైతులు ఎమ్మెల్యేను మధ్యలోనే అడ్డుకొని సాగునీరు తమ మండలానికి ఇప్పటి వరకు చేరలేదన్నారు.

ఎమ్మెల్యే నుంచి ఎలాంటి సమాధానం రాకపోడంతో రైతులు ఆగ్రహానికి లోనయ్యారు. సాగునీటిని విడుదల చేస్తామని చెప్పడం వల్లే తాము పంటల సాగు చేపట్టామని, తీరా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని చివరి ఆయకట్టుకు నేటికీ నీరు అందలేదని ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు.
సాగునీటిని కూడా ఇవ్వలేని నేతలు ఎందుకు అని ఎమ్మెల్యేను నిలదీశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అక్కడి నుంచి నిష్క్రమించే ప్రయత్నం చేయగా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాహనం వెనుక పరుగులు తీశారు. అనంతరం కాల్వశ్రీరాంపూర్ ఎస్సై షేక్ జానీపాషా సమక్షంలో అక్కడి నుంచి ఎమ్మెల్యే వెనుదిరిగారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications