ఆరేళ్ల చిన్నారిపై ఉన్మాదం, సర్జికల్ కత్తితో గొంతుకోసి.. హత్య, రక్తపుమడుగులో..
అతనో ఉన్మాది.. మంచి లేదు, మానవత్వం కూడా లేదు. పెద్దలపై పగను పసిపాపపై తీర్చుకున్నాడు. ఆరేళ్ల చిన్నారిని కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. మేడ్చల్ జిల్లా పోతారంలో జరిగిన ఘటన కలకలం రేపింది. చిన్నారి హత్యతో ఆ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. కరుణాకర్ అనే మావన మృగం.. సర్జికల్ కత్తితో బయటకు రాగా.. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న వారు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

కిరాతకుడు..
పోచారం ఇస్మాయిల్ ఖన్ గూడలో గల విహార్ హోమ్స్‌లో అనూష-కల్యాణ్ దంపతులు ఉంటున్నారు. వీరికి ఆరేళ్ల వయస్సున్న ఆద్య అనే కూతురు ఉంది. వీరి సంసారం సావ్యంగా సాగిపోతోంది. ఇంతలో కరుణాకర్ అనే మృగాడు ఎంట్రీ ఇచ్చాడు. ఇతను అనూష-కల్యాణ్ దంపతులకు పరిచయం అని తెలుస్తోంది. కానీ కపుల్‌తో ఏం గొడవ జరిగిందనే అంశంపై మాత్రం క్లారిటీ లేదు. గురువారం ప్లాట్‌లోకి వచ్చాడు. ఆ సమయంలో అనూష, ఆద్య ఇద్దరు ఉన్నారు. అనూషతో మాట మాట పెరిగింది.

రాక్షసత్వం..
ఇంకేముంది కోపోద్రిక్తుడైన కరుణాకర్ తనలోని రాక్షసత్వాన్ని చూపించాడు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న సర్జికల్ కత్తితో చిన్నారి గొంతు కోశాడు. దీంతో ఆ పాప కుప్పకూలిపోయింది. అమ్మ, నాన్న అంటూ అరుస్తూ.. చనిపోయింది. ఆ అపార్ట్‌మెంట్ వద్ద చిన్నారి రక్తపుమరకలు కనిపించాయి. వాస్తవానికి కరుణాకర్‌ను అడ్డుకునేందుకు అనూష విశ్వప్రయత్నం చేసింది. కానీ అతని నుంచి కూతురిని మాత్రం కాపాడలేకపోయింది. అనూషతో గొడవ నేపథ్యంలో కరుణాకర్ తెగించాడని తెలుస్తోంది. కానీ వారి మధ్య గొడవకు గల కారణంపై స్పష్టత లేదు.

పరిచయమేనా..?
కరుణాకర్.. అనూష దంపతులకు పరిచయం అని.. అప్పుడప్పుడు ఇంటికి కూడా వచ్చేవాడు అని స్థానికులు చెబుతున్నారు. బంధువు అయినా ఆయన ఎందుకు దుస్సహసానికి తెగించాడనే అంశంపై క్లారిటీ లేదు. హత్య చేసిన తర్వాత తాపీగా కిందకొచ్చాడు. స్థానికుల సమాచారంతో అక్కడికొచ్చిన పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులకు లొంగిపోయే సమయంలో భయపడలేదు. చిన్నారిని హత్య చేసే అనే బాధ అతని మొహంలో ఎక్కడా కనిపించలేదు.
Recommended Video

సిటీ నుంచి వచ్చి మరీ..
అనూష భర్త సమీపంలో ఉద్యోగం చేస్తారని.. కరుణాకర్ మాత్రం హైదరాబాద్‌లో ఉంటాడని తెలుస్తోంది. ప్రణాళిక ప్రకారమే కరుణాకర్ సర్జికల్ కత్తి తీసుకొచ్చాడని అర్థమవుతోంది. ప్లాన్ ప్రకారం చిన్నారి గొంతుకోసి తాపీగా దిగాడు. తర్వాత కూడా పారిపోవాలనే ఉద్దేశం లేదు... అందుకే పోలీసులు వచ్చాక.. లొంగిపోయాడు.












Click it and Unblock the Notifications