ఈనెల 14 నుంచి " ప్రజా సంగ్రామ యాత్ర ".. అమిత్ షా రాక ! : జేపీ నడ్డాతో బండి సంజయ్ కీలక భేటీ
తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్దమవుతున్నారు. తొలి విడత " ప్రజా సంగ్రామ యాత్ర" గ్రాండ్ సక్సెస్ కావడంతో మలి విడత యాత్రకు రెడీ అయ్యారు. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్‌ను కూడా ఖరారు చేశారు. ఇప్పటికే బీజేపీ అధినాయకత్వానికి తన యాత్ర గురించి వివరించారు. ఈనెల 14న బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రలో కేంద్ర హెంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొననున్నారు.
జేపీ నడ్డాతో బండి సంజయ్ భేటీ ..
ఈనేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో భేటీ అయ్యారు. తన రెండో విడత " ప్రజా సంగ్రామ యాత్ర" చర్చించారు. ఏప్రిల్ 14న ఆలంపూర్ జోగులాంబ శక్తిపీఠం నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు. పాదయాత్ర రూట్ మ్యాప్ గురించి వివరించారు. " ప్రజా సంగ్రామ యాత్ర" జరిగే క్రమంలో తెలంగాణకు రావాలని జేపీ నడ్డాను బండి సంజయ్ ఆహ్వానించారు. ఈ భేటీలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్ పాల్గొన్నారు.
తెలంగాణ రాజకీయాలపై ఆరా..
అటు రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను జేపీ నడ్డాకు బండి సంజయ్ వివరించారు. కేసీఆర్ ప్రభుత్వా ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. బండి సంబయ్ చేపట్టిన తొలి ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం కావడంపై జేపీ నడ్డా సంతృప్తి వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నియంత పాలన, కేసీఆర్ కుటుంబ అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను పార్టీ జాతీయ అధ్యక్షుడు మెచ్చుకున్నారు. బండి సంజయ్ రెండో విడత పాదయాత్ర సక్సెస్ కావాలని నడ్డా ఆకాంక్షించారు.

కేసీఆర్‌పై మరింత దూకుడుగా..
కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని తెలంగాణ నేతలకు నడ్డా సూచించారు. మరింత దూకుడుతో వెళ్లాలని నిర్దేశించారు. తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టేలా అందరూ కలిసి పనిచేయాలని చెప్పారు. వీలును చూసుకుని రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర జరిగే సమయంలో రాష్ట్రానికి వస్తానని బండిసంజయ్‌కి హామీ ఇచ్చారు. తెలంగాణ నాయకత్వానికి పూర్తిగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సానుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర నేతలు చేస్తున్న పోరాటాలు భేష్‌గా ఉన్నాయని అభినందించారు.












Click it and Unblock the Notifications