బీజేపీ ఆపరేషన్ తెలంగాణ: మోదీ- షా బిగ్ స్కెచ్, ఇక నుంచి..!!

ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తెలంగాణాలో మూడేళ్లు పూర్తవుతోంది. దీంతో.. వచ్చే ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. బీజేపీ కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. బీఆర్ఎస్ తిరిగి బలోపేతం కావాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది. త్వరలో జరిగే గ్రేటర్, ఖైరతాబాద్ ఉప ఎన్నిక నుంచి కొత్త రాజకీయం మొదలు కానుంది. ఇందు కోసం ప్రధాని మోదీ- అమిత్ షా ద్వయం ఆపరేషన్ తెలంగాణ ప్రారంభం కోసం వ్యూహాలతో సిద్దమైంది.

బీజేపీ, జనసేనకు ప్రతిష్ఠాత్మక ఎన్నిక- టీడీపీ మద్దతు ఎవరికి..!?
బీజేపీ, జనసేనకు ప్రతిష్ఠాత్మక ఎన్నిక- టీడీపీ మద్దతు ఎవరికి..!?

తెలంగాణలో మిషన్ 2028 మొదలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్ల కాలం పూర్తి కానుంది. ఈ క్రమంలో 2028 ఎన్నికల కోసం ప్రధాన పార్టీలు కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. బీఆర్ఎస్ తిరిగి తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ లక్ష్యంగా ప్రజల్లోకి వెళ్తోంది. అటు బీజేపీ సైతం వచ్చే ఎన్నికల పైన భారీగా ఆశలు పెట్టుకుంది. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి దక్షిణాదిలో బలపడాలని భావిస్తోంది.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఖరారు- రేవంత్ అనూహ్య ఎంపిక, బీఆర్ఎస్ 'ఫిక్స్'..!!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఖరారు- రేవంత్ అనూహ్య ఎంపిక, బీఆర్ఎస్ 'ఫిక్స్'..!!
BJP Big Plan for Telangana Narendra Modi and amit Shah Political Game Plan explained

అందులో భాగంగా తెలంగాణ, కర్ణాటక పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. దక్షిణాదిలో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంది. తమిళనాడు విజయ్ ప్రభుత్వం కాంగ్రెస్ తో కొనసాగుతోంది. దీంతో, తెలంగాణలో ఈ సారి ఎలాగైనా పట్టు పెంచుకోవాలనే వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. ఇందు కోసం నేరుగా ప్రధాని మోదీ- అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగుతున్నారు.

ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ కు ఇంకా ప్రజల్లో ఆదరణ పెరగలేదని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు... ఖైరతాబాద్ ఉప ఎన్నిక నుంచే తమ బలం పెరిగేలా కార్యాచరణ అమలు చేయాలని బీజేపీ నేతలు డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ గా మారిన రాజకీయంలో ప్రజలు తమ వైపు చూసేలా కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. నవంబర్‌లో హోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించబోతున్నారు.

ఆయన పూర్తిగా సంస్థాగత ప్రక్షాళనపైనే దృష్టి పెట్టటంతో పాటుగా నేతల మధ్య సమన్వయం.. ఎన్నికల వరకు ప్రజలతో మమేకం అయ్యే విధంగా రోడ్ మ్యాప్ ఫిక్స్ చేయనున్నారు. ఇక.. డిసెంబర్‌లో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కీలకం కానుంది. అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో పాటు భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. దీంతో.. ఈ డిసెంబర్ నుంచి వచ్చే ఎన్నికల వరకు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో వరుసగా పర్యటనలు చేయనున్నారు. మరి.. బీజేపీ వ్యూహాలు ఎంత వరకు ఫలిస్తాయనేది ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+