మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదు.. సీఎం కేసీఆర్‌ని : బండి సంజయ్
దేశ రాజ్యాంగాన్ని మార్చాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. అధికార గర్వంతో కళ్లు నెత్తికెక్కి కేసీఆర్ నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విపక్షనేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ వ్యాఖ్యలను టీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా సమర్థిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ భీం పాదయాత్ర
రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విరుచుపడ్డారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి పార్లమెంట్ వరకు "బీజేపీ భీం పాదయాత్ర"ను బండి సంజయ్ ఆధ్వర్యంలోని బీజేపీ ఎంపీలు చేశారు. ఈ పాదయాత్రలో ఆ పార్టీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపురావు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ సభ్య సమాజం తలదించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మార్చాల్సింది రాజ్యాంగాన్ని కాదని... ముఖ్యమంత్రి కేసీఆర్‌ని దుయ్యబట్టారు.

కేసీఆర్‌ను జైలుకు పంపడం పక్కా
తెలంగాణలో కేసీఆర్ పాలన పోయి ప్రజాస్వామిక పాలన రావాలన్నారు బండి సంజయ్. అవినీతిపై విచారణ భయంతోనే కేసీఆర్ ప్రజల్ని రెచ్చగొడుతున్నారంటూ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పేవరకూ తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అభినవ అంబేడ్కర్ తానేనని పాఠ్యాంశాల్లో చేర్చేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్‌ను జైలుకు పంపడం పక్కా అని హెచ్చరించారు.

ప్రజలే కేసీఆర్‌కు తగిన బుద్ధి చెబుతారు..
రాజ్యాంగంపై నోటికి వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే కేసీఆర్‌కు తగిన బుద్ధి చెబుతారని బండి సంజయ్ హెచ్చరించారు. ఓడిపోయిన కూతురికి ఎమ్మెల్సీ, మందులు ఇచ్చే వారికి రాజ్యసభ సీటు ఇవ్వడానికేనా రాజ్యాంగాన్ని మార్చాల్సింది అని నిలదీశారు. జీవోలతో ఉద్యోగుల మధ్య చిచ్చుపెట్టాలని రాజ్యాంగంలో ఉందా? , సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టాలని రాజ్యాంగంలో ఉందా? ఇవేవీ రాజ్యాంగంలో లేనందునే కొత్తది కావాలంటున్నారా? అని కేసీఆర్‌ను బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు రోజుకో కొత్త డ్రామాకు కేసీఆర్ తెర తీస్తున్నారని ఆగ్రహం వక్తం చేశారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications