టీడీపీకి బీజీపీ చీఫ్ బిగ్ ట్విస్ట్ - అనూహ్య మలుపు..!!

ఎన్డీఏ కూటమిలో కీలక మలుపు. తెలంగాణలో ఎన్డీఏ విస్తరణ అంశం పైన బీజేపీ చీఫ్ కీలక అంశం వెల్లడించారు. 2024 ఎన్నికల ముందు టీడీపీ - జనసేన ఎన్డీఏ కూటమిలో చేరాయి. కేంద్రంలో - ఏపీలో ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామిగా ఉంది. తెలంగాణలోనూ కూటమి విస్తరణ పైన కొంత కాలంగా చర్చ జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనే ప్రతిపాదన పైన ఢిల్లీ స్థాయిలో అంచనాలు వ్యక్తం అయ్యాయి. జూబ్లీహిల్స్ బై పోల్ తో సహకారం పైన స్థానిక నేతలు ఆసక్తి చూపారు. కాగా, ఇప్పుడు బీజేపీ చీఫ్ అసలు విషయం తేల్చి చెప్పారు.

ఏపీలో సక్సెస్ అయిన ఎన్డీఏ కూటమి ఫార్ములా తెలంగాణలోనూ అమలు చేయాలనే ప్రతిపాదన కొంత కాలంగా చర్చల్లో ఉంది. తెలంగాణలో పార్టీ పూర్వ వైభవం దిశగా చర్యలు ఉంటాయని ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు పలు మార్లు చెప్పుకొచ్చారు. గతంలో బీజేపీతో జనసేన సైతం కలిసి పని చేసింది. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే కలిసి వస్తుందని లెక్కలు వేసారు. గ్రేటర్ పరిధిలోని ఓటర్లు.. సామాజిక - ప్రాంతీయ సమీకరణాలు గ్రేటర్ లో పాగా వేసేందుకు మేలు చేస్తుందని భావించారు. దీనికి ముందే జరిగే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ బై పోల్ లో కలిసి పని చేయాలనే ప్రతిపాదన తెర పైకి వచ్చింది.

bjp-chief-clarifies-over-alliance-with-tdp-and-bjp-in-telangana-details-here

ఇదే సమయంలో తెలంగాణలో టీడీపీ - జనసేనతో పొత్తు పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్ర రావు తేల్చి చెప్పారు. ఏపీలో మాదిరిగా తెలంగాణలో బీజేపీకి పొత్తులు ఉండవని వెల్లడించారు. టీడీపీ, జనసేన సహా ఏ పార్టీతోనూ తెలంగాణలో పొత్తు ఉండదంటూ స్పష్టం చేశారు. తెలంగాణ లో బీజేపీ ఒంటరిగానే పోరాడుతుందని రాంచందర్‌రావు తేల్చి చెప్పారు.

ఏపీలో రాజకీయం వేరు అక్కడ పరిస్థితులు వేరు, కానీ తెలంగాణా రాజకీయం వేరు పరిస్థితులు వేరుగా చూడాలని పేర్కొన్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ కు మద్దతిచ్చిన అంశాన్ని గుర్తు చేసారు. పార్టీ కేడర్ కష్టంతో తెలంగాణలో బీజేపీ ఎదిగిందని.. ఎవరి మద్దతుతోనూ ముందుకు వెళ్లలేమని వివరించారు. ఎన్నిక లు ఏవి వచ్చినా బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేసారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఆ రెండు పార్టీలను గౌరవిస్తామని... తెలంగాణలో పొత్తు కు అవకాశం లేదని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+