తెలంగాణలో వ్యూహం మార్చిన బీజేపీ- రంగంలోకి పార్టీ చీఫ్.. కీలక నిర్ణయాలు...!!
తెలంగాణ పై బీజేపీ గురి పెట్టింది. కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. కీలక నేతలకు బాధ్యతలు అప్పగించింది. ముఖ్య నేతలు వరుసగా రాష్ట్రంలో పర్యటనలకు ప్లాన్ చేసారు. ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మహా పాదయాత్ర నిర్వహించారు. వచ్చే నెలలో ప్రధాని మోదీ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడి పర్యటన ఆసక్తిగా మారుతోంది. తెలంగాణలో అమలు చేస్తున్న వ్యూహం రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది.
తెలంగాణలో బీజేపీ వ్యూహం మార్చింది. దూకుడు పెంచింది. స్థానిక నాయకత్వంతో పాటుగా జాతీయ నేతలు సైతం తెలంగాణ కేంద్రంగా పని చేయటానికి సిద్దం అవుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన మహా పాదయాత్రకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా హాజరై విపక్ష కూటమిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ తర్వాత ఉద్యమాల కు, రాజకీయ చైతన్యానికి మారుపేరైన ఉత్తర తెలంగాణ కేంద్రమైన కరీంనగర్‌ను పార్టీ తదుపరి లక్ష్యంగా ఎంచుకుంది. నవంబర్ 18న కరీంనగర్లో నిర్వహించనున్న భారీ మహా పాదయాత్రలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్వయంగా పాల్గొననున్నారు. 'ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం- అరాచకత్వాన్ని పాతరేద్దాం' పేరుతో పాదయాత్ర నిర్వహించనున్నారు. పార్టీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కరీంనగర్ జిల్లాకు విచ్చేస్తుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. పార్టీ నేతలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు.

తెలంగాణ పై గురి పెట్టిన బీజేపీ నాయకత్వం
ఈ పాదయాత్రకు దాదాపు లక్ష మంది ప్రజలు, కార్యకర్తలను సమీకరించాలని లక్ష్యంగా ఫిక్స్ చేసారు. బీజేపీ లక్ష్యంగా 'సర్' అంశంపై కాంగ్రెస్, ఇండీ కూటమి పార్టీలు రాజ్యాంగ సంస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలు వివరించడమే లక్ష్యంగా పాదయాత్ర చేపడుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. నితిన్ నబీన్ తొలిసారి కరీం నగర్‌కు వస్తుండటంతో కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించాలని బండి సంజయ్ డిసైడ్ అయ్యారు. గాంధీ సర్కిల్, వైశ్య భవన్ నుంచి టవర్ సర్కిల్ మీదుగా కమాన్ వరకు పాదయాత్ర సాగనుంది. ఇందులో నితిన్ నబీన్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, బండి సంజయ్ పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా కరీంనగర్ పేరు మారుమోగేలా మహా పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసిన బీజేపీ నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తిగా మారాయి.













Click it and Unblock the Notifications
