Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీజేపీ అంటే బఫూన్ పార్టీ.!పాల్వాయి స్రవంతి నామినేషన్ పూర్తి.!గెలుపు తమదే అంటున్న రేవంత్.!

మునుగోడు/హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికలు నియోజకవర్గ అభివృద్ధికి రాలేదని, మునుగోడు ఉప ఎన్నికలు ఒక వ్యక్తి అమ్ముడుపోతే వచ్చాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీజేపి అభ్యర్ధి ధన దాహంతో కాంగ్రెస్ ను తాకట్టు పెట్టి పార్టీని చంపేయాలని చూస్తున్నాడని, కన్న తల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి శత్రువు పంచన చేరాడని రేవంత్ మండిపడ్డారు. నల్లగొండ గడ్డకు పోరాటాలు చేసిన చరిత్ర ఉందని, బీజేపీ, టీఆరెస్ నాయకులు ముఠాలతో, మూటలతో ఓట్లు కొల్లగొట్టాలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. మునుగోడులో పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలుకు బంగారిగడ్డ నుంచి చండూరు వరకు రేవంత్ రెడ్డి భారీ ర్యాలీగా చేరుకున్నారు.

 నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి.. భారీ ర్యాలీతో రేవంత్ కు స్వాగతం

నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి.. భారీ ర్యాలీతో రేవంత్ కు స్వాగతం

ఈ సందర్బంగా బీజేపి,బీఆర్ఎస్ పార్టీలపైన రేవంత్ చిందులు తొక్కారు. చిన్న ముల్కనూరు, మూడు చింతలపల్లి, లక్ష్మపూర్ ను సీఎం చంద్రశేఖర్ రావు దత్తత తీసుకున్నారు. నిన్న నామినేషన్ కు వచ్చిన కల్వకుంట్ల రామారావు దత్తత తీసుకుంటా అని లేనిపోని కబుర్లు చెబుతున్నాడని మండి పడ్డారు. కొడంగల్ లో నన్ను ఓడించేందుకు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా అని రామారావు అన్నాడని, అక్కడ రోడ్లపై గుంతల్లో తట్టెడు మట్టి కూడా వేయలేదని, దత్తత తీసుకున్న తర్వాత చేయాల్సిన అభివృద్ది ఇదేనా అని రేవంత్ సూటిగా ప్రశ్నించారు. చంద్రశఖర్ రావు, కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు మాయగాళ్లని, ఈ మాయగాళ్ల వలలో మునుగోడు ప్రజలు పడొద్దని, స్రవంతిని గెలిపిస్తే సమ్మక్క, సారక్కలా సీతక్కతో కలిసి అసెంబ్లీలో కొట్లాడుతారని రేవంత్ స్పష్టం చేసారు.

 ప్రలోభాలకు లొంగకుండా ఆలోచించి ఓటు వేయండి.. మునుగోడు ప్రజలకు టీపిసిసి ఛీఫ్ విజ్ఞప్తి..

ప్రలోభాలకు లొంగకుండా ఆలోచించి ఓటు వేయండి.. మునుగోడు ప్రజలకు టీపిసిసి ఛీఫ్ విజ్ఞప్తి..

కాంగ్రెస్ జెండా కోసం ప్రాణాలు వదిలిన బిడ్డలను ఆదర్శంగా తీసుకుని కొట్లాడుతున్నామన్నారు రేవంత్. మీరే మాకు ధైర్యమని, మీరు అండగా ఉన్నందు వల్లే మేం కొట్లాడగలుగుతున్నామని మునుగోడు ప్రజానికాన్ని ఉద్దేశించి పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి డిండి ప్రాజెక్టు కోసం 5వేల కోట్లు ఇప్పించగలడా.?ఒక్క ఆడ బిడ్డను ఓడించడానికి ఇంతమందా?అని ప్రశ్నించారు. చేతులెత్తి అడుగుతున్నానని, ఆడబిడ్డ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలని, మునుగోడు గడ్డపై ఈ ఆడబిడ్డను గెలిపించాలన్నారు రేవంత్. మునుగోడులో కాంగ్రెస్ గెలిస్తే బీజేపీ, టీఆరెస్ లకు బుద్ది చెప్పినట్టవుతుందని, కాంగ్రెస్ గెలుపు ప్రజల కోసమని, ప్రజాస్వామ్యం కోసమని, దళిత,బహుజనుల కోసమని, ప్రశ్నించే గొంతు కోసం కాంగ్రెస్ ను గెలిపించాలని రేవంత్ పిలుపునిచ్చారు.

 నియోజకవర్గంలో ఆడబిడ్డలం.. అసెంబ్లీలో పులిబిడ్డలం.. ఒక్క అవకాశం ఇవ్వాలన్న సీతక్క

నియోజకవర్గంలో ఆడబిడ్డలం.. అసెంబ్లీలో పులిబిడ్డలం.. ఒక్క అవకాశం ఇవ్వాలన్న సీతక్క

ఎనిమిదేళ్లుగా దోపిడీ చేస్తున్న టీఆరెస్, బీజేపీ లను మునుగోడు పొలిమేరలదాకా తరిమికొట్టాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేసారు. ఆడబిడ్డను దీవించి గెలిపించాలని, అసెంబ్లీలో అడబిడ్డలం మేమిద్దరం పులి బిడ్డలై గర్జించాలంటే, స్రవంతిని గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా అని, పుట్టుక నుంచి చావు దాకా జీఎస్టీ పేరుతో పేదలపై బీజేపీ భారం మోపుతోందని సీతక్క ఆవేదన వ్యక్తం చేసారు. బీజేపి ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోందని, రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయి మునుగోడు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఈ ఎన్నిక ఒక పునాదిలాంటిదని, ఒక్క అవకాశం మీ ఆడబిడ్డకు ఇవ్వండని, తనకు తోడుగా అసెంబ్లీకి పంపాలని మునుగోడు ప్రజలను సీతక్క వేడుకున్నారు.

 పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆశయ సాధన కోసం కృషి.. ఆడపడుచును ఆశీర్వదించాలన్న పాల్వాయి స్రవంతి

పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆశయ సాధన కోసం కృషి.. ఆడపడుచును ఆశీర్వదించాలన్న పాల్వాయి స్రవంతి


ఈ ఉప ఎన్నికలు ధన బలానికి, ప్రజా బలానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని, ప్రజల్ని నైతికంగా వంచించి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని, తాను మునుగోడు ఆడబిడ్డనని పాల్వాయి స్రవంతి విజ్ఞప్తి చేసారు. ఈ ధర్మ యుద్ధంలో తనను గెలిపించాలని, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేస్తానని స్రవంతి స్పష్టం చేసారు. కొంగు చాచి అడుగుతున్నానని, ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, ఇది మనందరం లోతుగా ఆలోచించాల్సిన సమయమన్నారు స్రవంతి. మనకు ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదు ఆలోచన అని, టీఆరెస్, బీజేపీ రకరకాల ప్రచారాలు చేస్తున్నాయని వాటిని నమ్మొదందన్నారు స్రవంతి. టీఆరెస్, బీజేపీ లు ఇచ్చిన హామీలు నెరవేర్చాయా? ఒక్కసారి ఆలోచించాలని, ఇచ్చిన హామీలను నెరవేర్చని వారు మిమ్మల్ని ప్రలోభ పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారుని, హామీలు నెరవేర్చి అభివృద్ధి చేసిన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని స్రవంతి అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+