బీజేపీ హిందువుల పార్టీనే -ధర్మానికి అడ్డొస్తే తొక్కేస్తాం -కేసీఆర్‌కు సమాధి: బండి సంజయ్ సంచలనం

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అంటోన్న బీజేపీ నేతలు.. దుబ్బాక ఉప ఎన్నిక నుంచి దూకుడు పెంచారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను టార్గెట్ చేస్తూ వివాదాస్పద, సంచలన కామెంట్లకు సైతం వెనుకాడటంలేదు. ఈ క్రమంలో తమ పార్టీ ఐడియాలజీ, విధానాలపైనా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కుమార్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ హిందువుల పార్టీనే

బీజేపీ హిందువుల పార్టీనే

భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ముమ్మాటికీ హిందూ మతస్తుల పార్టీనే అని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హిందూ ధర్మానికి ఎవరైనా అడ్డొస్తే, వాళ్లందరినీ తొక్కేస్తామని ఆయన హెచ్చరించారు. సీఎం కేసీఆర్ పదే పదే హిందువులను అవమానిస్తున్నారని ఆక్షేపించారు. తాము ఛత్రపతి శివాజీ వారసులమైతే లాడెన్, బాబర్, అక్బర్ ల వారసుడు కేసీఆర్ అని సంజయ్ చెప్పారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న కేసీఆర్ ను బొంద పెడతామని వార్నింగ్ ఇచ్చారు

బాక్సులు బద్దలు కొడతాం..

బాక్సులు బద్దలు కొడతాం..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత, నికృష్ట ముఖ్యమంత్రి అని, గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకుల బాక్సులు బద్ధలు కొడతామని సంజయ్ అన్నారు. తెలంగాణలో బియ్యం, డబుల్ బెడ్రూమ్, రోడ్లు, లైట్లు, టాయిలెట్ పథకాలకు నిధులన్నీ కేంద్రానివేనన్నారు. పేదలు కష్టాల్లో ఉన్నా పరామర్శించకపోవడం కేసీఆర్ కు అలవాటుగా మారిందని విమర్శించారు. ఇటీవల వరదల సమయంలో భవంతులు, బంగళాలు మునగలేదు కాబట్టే కేసీఆర్ పట్టింపు లేకుండా ఇంటి నుంచి బయటికి రాలేదని సంజయ్ ఎద్దేవా చేశారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్క ఇంటినీ సర్వే చేయాలని, బాధితులందరికీ నష్ట పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు.

 కేసీఆర్ ఏం పొడిచాడు?

కేసీఆర్ ఏం పొడిచాడు?

తెలంగాణలో అమలవుతోన్న మేజర్ పథకాలు అన్నింటికీ కేంద్రం నుంచే నిధులు వస్తున్నాయని, అన్ని కేంద్రమే ఇస్తే ఇక కేసీఆర్ ఏం చేస్తాడో చెప్పాలని బీజేపీ చీఫ్ డిమాండ్ చేశారు. తెలంగాణలో నియంత పాలన సాగుతోందని, కేసీఆర్ కు రోజులు దగ్గరపడ్డాయని, నిజాంను స్ఫూర్తిగా పరిపాలిస్తోన్న కేసీఆర్ కు ప్రజలే గోరీ కడతారని సంజయ్ విమర్శించారు. గతంలో సమగ్ర సర్వేతోగానీ, ఇటీవల ధరణి పోర్టల్ ఏర్పాటుతోగానీ కేసీఆర్‌ పొడిచిందేమీలేదని, తప్పుడు జీవోలతో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని బండి సంజయ్ మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+