చీడపురుగు: కేసీఆర్‌పై బాబు మోహన్ నిప్పులు, ‘ఆందోల్‌లో బీజేపీ జెండా ఎగరేస్తాం’
ఆందోల్: తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగు అని తాజా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బాబు మోహన్ విమర్శించారు. బుధవారం జోగిపేట హౌసింగ్ బోర్డు కాలనీలో బీజేపీ కార్యాలయాన్ని బాబు మోహన్ ప్రారంభించారు.
అనంతరం బాబు మోహన్ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ దళితుల్ని అవమానపరుస్తున్నారని మండిపడ్డారు. దళితుడే ముఖ్యమంత్రి అని ప్రకటించిన కేసీఆర్ నలుగురు దళితులను మోసం చేశాడని ఆరోపించారు. కేసీఆర్ దళిత వ్యతిరేకి అని అన్నారు.

బీజేపీకి దళితుడ్ని పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్రపతిగా అవకాశం కల్పించిన ఘనత ఉందని బాబు మోహన్ చెప్పారు. టీఆర్ఎస్ నాయకులు సూది, దారం, చెక్కర అంటూ దర్జీల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మహా మహా రాజులకు బట్టలు కుట్టిన చరిత్ర దర్జీలదని బాబు మోహన్ వ్యాఖ్యానించారు. బీజేపీ జెండా ఆందోళ్ నియోజకవర్గంలో ఎగురవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ.. డబ్బు, మద్యానికి దూరమని ఆయన చెప్పారు.
-
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత












Click it and Unblock the Notifications