కాంగ్రెస్, బీఆర్ఎస్ అదే మాట: కేసీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్
కరీంనగర్: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విమర్శలు గుప్పించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యద్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. కరీంనగర్ కదనభేరి సభలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్ కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ హోదా ఇచ్చిందే బీజేపీ అని ఆయన గుర్తు చేశారు.
కేంద్రం స్మార్ట్ సిటీ ఇస్తే తామే తెచ్చామని కేసీఆర్ చెబుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా, కేసీఆర్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదని విమర్శించారు. నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రం నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించిందని బండి సంజయ్ ఆరోపించారు. కేంద్రం మూడు సార్లు లేఖలు రాసినా నాటి కేసీఆర్ సర్కారు స్పందించలేదన్నారు బండి సంజయ్.

కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ తెచ్చానని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ చెప్పుకుంటున్నారని బండి సంజయ్ తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ జోరుగా ప్రచారం చేసి అధికారం చేపట్టిందని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఆరు గ్యారెంటీలను ప్రజలు విశ్వసించరని గ్రహించి, మరోసారి కమలం, గులాబీ పార్టీలు ఒక్కటే అని ప్రచారం ప్రారంభించిందని కాంగ్రెస్‌పై మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య చీకటి ఒప్పందం నడుస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే అవినీతి ఆరోపణలు వచ్చాయని.. ఈ కాళేశ్వరం అన్నీ తర్వాతనే అని చెప్పుకొచ్చారు. సహారా, ఈఎస్‌ఐ కేసుల్లో చేసిన అవినీతిపై కేసీఆర్ ఇంతవరకు స్పందించలేదని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ వచ్చి రిపోర్ట్ ఇస్తే.. మేడిగడ్డ కుంగుబాటు ఇష్యూ చిన్నదిగా అభివర్ణిస్తున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు. ఏమిలేని కేసీఆర్ లక్షాధికారి ఏవిధంగా అయ్యారని ప్రశ్నించారు. అవినీతి ఆస్తులన్నీ జప్తు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణకు అన్ని రకాలుగా అన్యాయం చేసింది కేసీఆరేనని బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్ అభివృద్ధికి వేల కోట్లు తెచ్చి అభివృద్ధి చేసినట్లు ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications