సాగునీరిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీచేయను: జగదీష్‌రెడ్డికి సంకినేని సవాల్
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీచేయనని బిజెపి నేత సంకినేని వెంకటేశ్వర్‌రావు సవాల్
సూర్యాపేట: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సూర్యాపేట జిల్లాలో రెండు పంటలకు సాగునీరిస్తే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేయనని బీజేపీ నేత సంకినేని వెంకటేశ్వరరావు చెప్పారు.
మంగళవారంనాడు సూర్యాపేటలో సంకినేని వెంకటేశ్వర్‌రావు మీడియాతో మాట్లాడారు. రెండు పంటలకు సాగునీరిస్తే మంత్రి జగదీష్‌రెడ్డి తరపున ప్రచారం చేస్తానని సంకినేని వెంకటేశ్వర్‌రావు అన్నారు.

ఒకవేళ నీరివ్వలేకుంటే జగదీష్‌రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకుంటారా..? అని సంకినేని వెంకటేశ్వర్‌రావు సవాల్‌విసిరారు. ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సంకినేని విమర్శలు చేశారు.
తన సవాల్‌కు మంత్రి జగదీష్‌రెడ్డి సిద్దమేనా అంటూ సంకినేని వెంకటేశ్వర్‌రావు ప్రశ్నించారు.2014 ఎన్నికల్లో సంకినేని వెంకటేశ్వర్‌రావుపై స్వల్ప మెజారిటీతో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన జగదీష్‌రెడ్డి విజయం సాధించారు.












Click it and Unblock the Notifications