Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"కారు" కు కమలం పంక్చర్ - లీడ్ లో బీజేపీ నేతలు వీరే..!!

తెలంగాణ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిక్యత కొనసాగుతోంది. దాదాపు రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్కంటే మెజార్టీ సీట్లలో ఆధిక్యతలో కొనసాగుతోంది. బీఆర్ఎస్ క్రమేణా పుంజుకుంటోంది. ఇదే సమయంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ బీజేపీ 10 సీట్లలో ముందంజలో ఉంది. దీంతో, చివరి రౌండ్లలో అనూహ్య ఫలితాలు వస్తే మినహా కాంగ్రెస్ విజయం ఖాయంగా కనిపిస్తోంది.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా వెళ్తోంది. 64 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. బీఆర్ఎస్ 39 స్థానాల్లో ముందంజలో ఉంది. అయితే, బీజేపీ 10 స్థానాల్లో తొలి స్థానంలో ఉంది. ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో బీఆర్ఎస్ అడ్రస్ గల్లంతు అయింది. బీజేపీ నేతల్లో హుజూరాబాద్ లో ఈటల వెనకంజలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి లీడ్ లో కొనసాగుతున్నారు. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ వెనకంజ లో ఉన్నారు. కరీంనగర్ లో గంగుల కమలాకర్..బండి సంజయ్ మధ్య హోరా హోరీ సాగుతోంది. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్ లో బీజేపీ అధిక్యం కొనసాగుతోంది. ఉత్తర, దక్షిణ తెలంగాణలో ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్దులు నిలిచారు.

BJP Leads in 10 segments in northern Telangana Area, hits BRS Vote Bank

గ్రేటర్ హైదరాబాద్ లో హోరాహోరీ పోరు కనిపిస్తోంది. హైదరాబాద్ లో మెజార్టీ స్థానాల్లో కారు ఆధిక్యతలో ఉంది. రెండు రౌండ్లు ముగిసే సరికి మ్యాజిక్ ఫిగర్ చేరిన కాంగ్రెస్ అధికారం దిశగా దూసుకెళ్తోంది. గోషామహల్ లో రాజాసింగ్ లీడ్ లో ఉన్నారు. అదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో బీజేపీ బలం పెంచుకుంది. బీసీ సీఎం నినాదం, ఎస్సీ వర్గీకరణ నిర్ణయాలు బీజేపీకి కలిసి వచ్చాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే బీజేపీ పది సీట్లు గెలుచుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కామారెడ్డిలో ఆధిక్యత దోబుూచులాడుతోంది. కేసీఆర్ మూడో స్థానంలో ఉన్నారు. బీజేపీ - కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగుతోంది.

హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్, ముషీరాబాద్ లో బీజేపీ ముందంజలో ఉంది. కరీంగనర్, నిజామాబాద్, అదిలాబాద్ లో బీజేపీ పుంజుకోవటంతో బీఆర్ఎస్ ఈ జిల్లాల్లో భారీ ఎదురుదెబ్బ తగలింది. ఇక్కడ కాంగ్రెస్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంటోంది. నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. హైదరాబాద్ లో బీఆర్ఎస్ 7 స్థానాలు, బీజేపీ 3 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నాయి. ఇవే ట్రెండ్స్ కొనసాగితే కాంగ్రెస్ అధికారంలోకి రావటం..బీజేపీ పది స్థానాలు గెలుచుకోవటం ఖాయంగా కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+