రాజా సింగ్‌కు బెదిరింపు ఫోన్ కాల్: ‘దమ్ముంటే రా’ అంటూ సవాల్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ చేసిన దుండగులు.. శ్రీరామ నవమి సందర్భంగా శోభాయాత్ర చేపడితే చంపేస్తామంటూ ఆయన్ను బెదిరించారు. దీంతో రాజా సింగ్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్ ఎవరు చేశారనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా రాజా సింగ్ శోభాయాత్ర నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు బెదిరింపు కాల్ రావడం గమనార్హం. గతంలో కూడా ఆయనకు ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి.

కాగా, చంపేస్తామంటూ ఎమ్మెల్యేకు బెదిరింపులు వచ్చాయి. దీనిపై స్పందించిన రాజాసింగ్... 'ఫోన్‌లో కాదు దమ్ము ఉంటే నేరుగా రావాలని' సవాళ్లు విసిరారు.7199942827, 4223532270 నెంబర్స్ నుంచి తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని రాజా సింగ్ తెలిపారు. అయ్యోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో రాజసింగ్‌కు తాజాగా బెదిరింపులు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇది ఇలావుండగా3, కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే రాజా సింగ్.. అప్పటి రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్‌కి లేఖ రాశారు. తనను చంపుతామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు తనకు ఏ ఏ నెంబర్ల నుంచి కాల్స్ వచ్చాయో.. ఆ జాబితాను డీజీపీకి రాసిన లేఖలో వివరించారు. తనను చంపుతామంటూ పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా కూడా వెల్లడించారు రాజా సింగ్.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications