పార్టీనుండి తొలగించండి, శత్రువర్గానికి ప్రోత్సాహమంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పనిచేసేవారికి పార్టీలో పదవులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. తన వల్ల పార్టీకి ఇబ్బంది అనుకొంటే పార్టీని నుండి తొలగించాలని ఆయన పార్టీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కు లేఖ రాశారు.

బిజెపి రాష్ట్ర నాయకత్వానికి రాజాసింగ్ కు మద్య పొసగడం లేదు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా కిషన్ రెడ్డి ఉన్న సమయంలో రాజాసింగ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. వారిద్దరి మద్య గ్యాప్ ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.

Bjp Mla Rajasingh sensational comments on Bjp state leadership

లక్ష్మణ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వా పార్టీ కార్యక్రమాల్లో రాజాసింగ్ చురుకుగా పాల్గొంటున్నారు.అయితే రాజాసింగ్ ఇటీవల ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన సందర్భంగా చేసిన పార్టీ నాయకుల తీరుపై ఫిర్యాదు చేశారు.

తన నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నవారికి పార్టీ పదవుల్లో అగ్ర స్థానం కల్పిస్తున్నారని ఆయన ఆరోపించారు. తనకు తెలియకుండానే పార్టీ పదవుల్లో తన వ్యతిరేక వర్గంతో నింపుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు.తన వల్ల పార్టీకి ఇబ్బంది అనుకొంటే పార్టీ నుండి తొలగించాలని ఆయన లక్ష్మణ్ కు లేఖ రాశారు. రాష్ట్ర బిజెపిలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయన్నారు. ఈ గ్రూపుల వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరుగుతోందని అమిత్ షా కు రాజాసింగ్ ఫిర్యాదు చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bjp Mla Rajasingh sensational comments on Bjp state leadership on Friday.he alleged Some party leaders encourage my enemy group in Goshamahal segment, Rajasingh wrote a letter to BJP state president.
Please Wait while comments are loading...