రియల్ ఎస్టేట్ బ్రోకర్ చెంప ఛెల్లుమనిపించిన ఈటల రాజేందర్

భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. పేదల భూములు ఆక్రమించుకుంటున్న ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై చేయి చేసుకున్నారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఈ ఘటన చోటు చేసుకుంది. మున్సిపాలిటీలోని ఏకశిలానగర్‌లో మంగళవారం ఈటల రాజేందర్ పర్యటించారు.

బాధితుల ఫిర్యాదుతో రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సదరు వ్యక్తిపై ఆయన చేయిచేసుకున్నారు. దీంతో అక్కడే ఉన్న ఈటల అనుచరులు అతడ్ని చితకబాదారు. పేదలైన ఇంటి స్థలాల యజమానులను ఇబ్బంది పెడుతున్నారంటూ మండిపడ్డారు.

BJP MP Eatala Rajender slaps a real estate broker

తాను తన 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరిపైనా చేయి చేసుకోలేదని ఈటల రాజేందర్ తెలిపారు. కానీ, ఈ రోజు పేదలకు న్యాయం కోసం చేయి చేసుకోవాల్సి వచ్చిందన్నారు. పేదలు కొనుక్కున్న జాగాకు బీజేపీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. కొందరు అధికారులు బ్రోకర్లకు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. భూములు కొనుకున్న పేదల సమస్యలపై జిల్లా కలెక్టర్, సీపీతో మాట్లాడినట్లు ఈటల తెలిపారు.

కొందరు దొంగ పత్రాలతో పేదల భూములను లాక్కుంటున్నారని ఈటల రాజేందర్ తెలిపారు. బ్రోకర్లకు సహకరించే అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ దళారులతో పోలీసులు, అధికారులు కుమ్మక్కవుతున్నారని ఆరోపించారు. కూల్చివేతలు తప్ప.. పేదల కన్నీళ్లు పట్టించుకోవడం లేదని ఈటల రాజేందర్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

'విశ్వనగరంలో వీధి రౌడీల పాలనా..? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి, తెలంగాణ ప్రజలలో ఒకటే గోస.. పర్మిషన్లు ఉన్నప్పటికీ పేదల ఇండ్లను మాత్రమే టార్గెట్ చేస్తూ ప్రభుత్వేతర శక్తులతో కూల్చివేతలు కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవు గుర్తుంచుకోండి!' అంటూ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+