కవిత వెనుక ఉన్నదెవరో బయట పెట్టిన బీజేపీ..!!
ఎమ్మెల్సీ కవిత వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. కవిత లేఖ తరువాత బీఆర్ఎస్ లో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. కవిత తనకు పార్టీలో ప్రాధాన్యత లేకుంటే కొత్త పార్టీ దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ పిలుపు కోసం కవిత నిరీక్షిస్తున్నట్లుగా పార్టీ నేతల సమాచారం. ఇప్పటికే కవిత లేఖ వ్యవహారం పైన కేటీఆర్ స్పందించారు. ఇక, కవిత లేఖ.. చోటు చేసుకుంటున్న పరిణామాల వెనుక ఉన్నదెవరనే అంశం పైన బీజేపీ ముఖ్య నేత లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేసారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బయటకు వచ్చి బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పోరాడుతారా అనే అంశంపై స్పష్టత రావాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆస్తిత్వం కోసమే కవిత ఆరాటమని, ఆమె చేసిన ప్రకటన ఆమెకు సంచలనం అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే, ప్రజలకు ఏం సంచలనం కాదని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. ఒకప్పుడు అన్నలు వదిలిన బాణాలు.. ఇప్పుడు అన్న ల మీదికే తిరగబడుతున్నాయని చెప్పారు. ఏపీలో షర్మిల రెడ్డి, వైఎస్ జగన్ పై బాణం ఎక్కుపెడి తే, తెలంగాణాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కవిత బాణాలు సందిస్తున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు. ప్రజల అవసరాల కంటే కుటుంబ అవసరాలే ముఖ్యమనే తీరులో వైఎస్, కేసీఆర్ ఫ్యామిలీలు రచ్చకెక్కాయన్నారు.

కాంగ్రెస్ పాత్ర
అన్నల మీదకు చెల్లెళ్లలను ఉసిగొల్పడంలో కాంగ్రెస్ ప్రధాన పాత్ర పోషిస్తోందని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పై తీవ్ర అసంతృప్తి ఉందని, అప్పుల ఊబిలో ఉందని స్వయం గా సీఎం రేవంత్ రెడ్డి బీద అరుపులు అరుస్తూ ప్రజల దృష్టి మారాల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో, రాష్ట్రలో బీజేపీ వెలిగిపోతుందని, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచి వేస్తోందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు బీజేపీ ప్రత్యామ్నాయని.. కవిత, కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించమని చెప్పకనే చెప్పారన్నారు. కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరో కవిత చెప్పాలని, కేటీఆర్ ఆధిపత్యాన్ని సవాల్ చేయడంగానే చూస్తున్నామని, మూడో వ్యక్తి ప్రమేయంలేని లేఖను ఎవరు లీక్ చేసారో చెప్పాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications