ఇళ్లు కట్టా, పెళ్లి చేశా! ఎంపీల్యాడ్స్ నిధుల వాడకంపై ఎంపీ సోయం బాపూరావు సంచలనం: వీడియో వైరల్

ఆదిలాబాద్: ఎంపీ ల్యాడ్ నిధుల వినియోగంపై బీజేపీ ఎంపీ సోయం బాపూరావు చేసిన సంచలన వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. తాజాగా, కేంద్రం మంజూరు చేసిన ఐదు కోట్ల నిధుల కేటాయింపుపై ఇటీవల పార్టీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలతో తన నివాసంలో సోయం బాపూరావు అంతర్గత సమావేశం నిర్వహించారు.

ఆ సమావేశంలో తొలి రెండు విడతల్లో కేటాయించిన నిధులను పార్టీ శ్రేణులకు కేటాయించలేకపోయానని ఎంపీ సోయం తెలిపారు. ఈ క్రమంలోనే ఆ నిధులపై వచ్చిన కమిషన్‌లతో ఇంటి నిర్మాణం తోపాటు కొడుకు పెళ్లి చేసినట్లుగా చెప్పుకొచ్చారు. ఇక గతంలో ఉన్న ఎంపీలు మొత్తం నిధులు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. ఇప్పుడు వచ్చిన నిధుల్లో పైసా తనకు ఇవ్వనక్కర్లేదని.. ఎన్నికల్లో పార్టీకి ప్రయోజనం కలిగేలా పనులు చేయాలని సోయం బాపూరావు పిలుపునిచ్చారు.

BJP MP Soyam Bapu Rao admits to using MPLADS funds for his sons wedding, house construction

కాగా, ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయంపై తాజాగా సోయం బాపూరావు స్పందించారు. ఈ వ్యాఖ్యలు తప్పని ఆయన కొట్టిపారేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. తాను నిధుల దుర్వినియోగానికి పాల్పడలేదని స్పష్టం చేశారు. తాను ఎంపీ ల్యాడ్స్ దుర్వినియోగం చేసినట్లు రుజువు చేస్తే తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. తనపై కుట్రపూరితంగానే ఇలాంటివి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

'కొంత ఎంపీ నిధులను వాడుకుని ఇళ్లు కట్టుకున్నా. ఎంపీ ల్యాడ్స్ నిధులతోనే కుమారుడి పెళ్లి చేశాను. నిధులు వాడుకోవడం తప్పా? గతంలో ఉన్న ఎంపీల మాదిరిగా నిధుల గోల్‌మాల్‌కు పాల్పడలేదు. అభివృద్ధి కోసం మీకు నిధులు పంచకపోవడం వాస్తవమే. ఒక ఎంపీగా సొంత ఇళ్లు లేకపోతే గౌరవం ఉండదనే.. ఎంపీ నిధులను వినియోగించుకుని ఇల్లు నిర్మించుకున్నాను.' అంటూ ఎంపీ సోయం బాపూరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. దీంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన క్లారిటీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+