'జయలలితకు పట్టిన గతే కెసిఆర్ కు, 20 నెలలపాటు ప్రభుత్వం కాపాడుకొంటే గొప్పే'
వచ్చే 20 మాసాల పాటు ప్రభుత్వం కాపాడుకొంటే టిఆర్ఎస్ కు గొప్పే అని బిజెపి సీనియర్ నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్:వచ్చే 20 మాసాల పాటు ప్రభుత్వం కాపాడుకొంటే టిఆర్ఎస్ కు గొప్పే అని బిజెపి సీనియర్ నాయకుడు నాగం జనార్థన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వచ్చే 20 ఏళ్ళ పాటు తెలంగాణలో కెసిఆర్ అధికారంలో ఉంటారని చెబుతున్నారని, 20 ఏళ్ళు కాదు, వచ్చే 20 నెలలపాటు అధికారాన్ని కాపాడుకోవడం గొప్పేనని చెప్పారు.
ఆదివారం నాడు హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో జయలలితకు పట్టిన గతే కెసిఆర్ కుటుంబానికి పడుతోందన్నారు.

తెలంగాణలో వచ్చే 20 ఏళ్ళు టిఆర్ఎస్ దేనని హారీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.సెక్రటేరియట్ లో అడుగుపెట్టకుండా అపరిష్కృతంగా పేరుకుపోయిన ఫైళ్ళను చూసి మీకు 20 ఏళ్ళు అధికారం ఇవ్వాలా అని ఆయన ప్రశ్నించారు.
టిఆర్ఎస్ అవినీతిపై బిజెపి శాసనసభపక్ష నాయకుడు కిషన్ రెడ్డి లేవనెత్తిన అంశాలను మాట్లాడే దమ్ముందా అని ఆయన సవాల్ విసిరారు.
మంత్రి హారీష్ రావు ఊచలు లెక్కపెట్టడానికి సిద్దంగా ఉండాలని చెప్పారు.టిఆర్ఎస్ నేతలకు కళ్ళుమూసినా తెరిచినా మోడీ, అమిత్ షా లే కన్పిస్తున్నారని చెప్పారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు.త్వరలోనే కెసిఆర్ అవినీతిని బయటపెడతామన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications