• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎంత పనాయే కోమటి రెడ్డి..? ఎవరూ దేకక పాయె..! ఎటూ గాకుండా పోతివి..!!

|
  బీజేపీ లో చేరడం పై ఎటూ తేల్చుకోలేకపోతున్నకోమటిరెడ్డి| Komatireddi Is Unable To Decide Joining In BJP

  హైదరాబాద్ : గత కొంత కాలంగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అకస్మాత్తుగా సైలెంట్ అయిపోయారు. వారం పది రోజుల నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు... టీవీ వార్తల్లో వినిపించడం లేదు, పేపర్ వార్తల్లో కనిపించడం లేదు. ఏమై ఉంటుంది...? బీజేపీని పొగుడుతూనో, కాంగ్రెసును దూషిస్తూనో, తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు ప్రభుత్వాన్ని తిడుతూనో, ఎప్పుడూ వార్తల్లో ఉండే ఆయన ఈమధ్యన ఎందుకు సైలెంటయ్యారు ? దీని వెనుక పెద్ద కథే ఉందట.

  ఆయన పరిస్థితి ఇప్పుడు 'రెంటికి చెడ్డ రేవడి' లా తయారైందట. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ పార్టీనే విమర్శించారు కోమటిరెడ్డి. తాను బీజేపీలో చేరబోతున్నట్టు, ఆ పార్టీలోనే భవిష్యత్ ఉంటుందని చెప్పి సంచలన ప్రకటనలు గుప్పించారు. బీజేపీలో తానే సీఎం అభ్యర్థి అంటూ ఆయన చేసిన ప్రకటనే ఇప్పుడు ఆయనను బీజేపీలోకి చేరకుండా అడ్డుకుంటోందన్న చర్చ పెద్ద యెత్తున సాగుతోంది.

  తాజాగా. బీజేపీలో చేరాలని ఆశపడ్డ కోమటిరెడ్డి ప్రయత్నాలకు ఆ పార్టీ అధిష్టానం బ్రేక్ వేసింది.

   bjp shocked Komati reddy Rajgopal.!He became alone..!!

  రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లక్ష్మన్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కలిసి కోమటిరెడ్డి తీరును అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. వీరిద్దరూ వ్యతిరేకించడంతోనే కోమటిరెడ్డి చేరికను బీజేపీ అధిష్టానం పక్కన పెట్టిందన్న చర్చ సాగుతోంది. బీజేపీలోకి వెళ్తే తానే సీఎం క్యాండిడేట్ అని కోమటిరెడ్డి అదుపుతప్పి వ్యాఖ్యలు చేసారు. దాంతో అనాదిగా బీజేపీనే పట్టుకొని ఎదిగిన రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహానికి గురైనట్టు తెలుస్తోంది.

  అందుకే ఆయన దూకుడుతో పార్టీకి నష్టమని, చేర్చుకోవద్దని అధిష్టానంతో చెప్పారట. ఈ నేపథ్యంలోనే, రాజగోపాల్ రెడ్డి సైలెంటయ్యారట. తెలంగాణ పార్టీ పగ్గాలను తన చేతికి ఇవ్వాలన్న ఆయన డిమాండ్ చేశారని, అందుకే బీజేపీ దూరం పెట్టిందని తాజాగా వార్తలు ఘుప్పుమంటున్నాయి.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Komatireddy Rajagopal Reddy who has become a sensation in Telangana politics over the past few years has suddenly become silent. The name of Komatireddy Rajagopal Reddy from ten days a week ... is not heard in TV news, does not appear in paper news.The announcement that he himself was the CM candidate in the BJP is now being debated to prevent him from joining the BJP.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more