Bandi Sanjay: బండి సంజయ్‍కు బుల్లెట్ ప్రూఫ్ వాహనం.. త్వరలో అందుబాటులోకి..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కోసం ఆయన మిత్రులు బుల్లెట్ ప్రూఫ్ వాహనం తయారు చేయించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు త్వరలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం అందుబాటులోకి రానుంది. పార్టీ అధ్యక్షుడైన బండి సంజయ్ కు కొందరు మిత్రులందరు కలిసి ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తయారు చేయిస్తున్నారు. కాగా.. బండి సంజయ్ కొత్త సచివాలయానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

డోములు కూల్చేస్తాం

డోములు కూల్చేస్తాం

తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కొత్త సచివాలయం డోములు కూల్చివేస్తామన్నారు.తాజ్ మహల్ తరహాలో ఉన్న ఆ డోములు తెలంగాణ సంస్కృతికి భిన్నంగా ఉన్నాయని చెప్పారు. వాటిని కూల్చి, తెలంగాణ సంస్కృతికి అనుగుణంగా మళ్లీ మార్పులు చేర్పులు చేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ లో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గం బోయినపల్లి చౌరస్తాలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కు హాజరైన బండి సంజయ్ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఓవైసీ

ఓవైసీ

తాజ్ మహల్ కంటే అద్భుతంగా సచివాలయాన్ని నిర్మించారని ఓవైసీ కేసీఆర్ పొగుడుతున్నాడని.. అసదుద్దీన్ ఓవైసీ కళ్లలో ఆనందం చూడడం కోసమే కేసీఆర్ తాజ్ మహల్ నమూనాలో కొత్త సచివాలయాన్ని నిర్మించారని సంజయ్ ఆరోపించారు. కాగా రాష్ట్రంలో నలుగురు కలెక్టర్లు సీఎం కేసీఆర్ కు ఆస్తులు కూడబెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలసిందే.

కలెక్టర్లు

కలెక్టర్లు

అయితే ఆయన ఆరోపణులు చేయడమే కాదు.. ఆ నలుగులు కలెక్టర్లపై ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. తమ వద్ద ఆధారలున్నాయని కూడా సంజయ్ చెప్పారు. ఆ నలుగురు కలెక్టర్లు కేసీఆర్ కుటుంబానికి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. త్వరలోనే ఆ నలుగురు కలెక్టర్ల బండారం బయట పెడతానని చెప్పిన సంజయ్.. తాజాగా డీవోపీటీ అధికారుల అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ధరణి పేరుతో ఆ నలుగురు కలెక్టర్లు పేదల భూము లను లాక్కున్నారని సంజయ్ అన్నారు.

పక్కా ఆధారాలు

పక్కా ఆధారాలు

ఆ నలుగురు కలెక్టర్లపై పక్కా ఆధారాలు తీసుకున్న బండి సంజయ్ గురువారం లేదా శుక్రవారం ఢిల్లీలోని డిపార్ట్ మెంట్ఆఫ్ పర్సనల్ ట్రెయినింగ్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. బుధవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఆయన డీవోపీటీ అపాయింట్ మెంట్ ఇవ్వగానే వారిని కలిసి ఆధారాలు సమర్పించే అవకాశం ఉంది. కాగా ఈ మధ్య టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను పేల్చేయాలని వ్యాఖ్యలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+