కడియంని కలిసిన కృష్ణయ్య, 'ఓటుకు నోటు' ఉదయ్‌కు షాక్, ఎక్సైజ్ కస్టడీకి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఎల్బీ నగర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య గురువారం కలిశారు. ఇంటర్మీడియట్ విద్యను ఉచితంగా అందిస్తారని ప్రకటించినందుకుగాను ఆయనకు అభినందనలు తెలిపారు.
అనంతరం కడియం శ్రీహరికి సన్మానం చేశారు. విశ్వవిద్యాలయ హాస్టల్ మెస్ చార్జీలు పెంచాలని ఆర్ కృష్ణయ్య కోరారు. చార్జీల పెంపు అంశంపై కడియం సానుకూలంగా స్పందించారు.
ఉదయ్ సిన్హాను కస్టడీకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు

ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టై చర్లపల్లి జైలులో ఉన్న ఉదయ్ సిన్హాను ఎక్సైజ్ పోలీసులు గురువారం నాడు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో పాటు సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలు అరెస్టైన విషయం తెలిసిందే.
ఆ తర్వాత వారి నివాసాల్లో పోలీసులు సెర్చ్ చేశారు. ఈ సందర్భంగా ఉదయ్ సిన్హా నివాసంలో విదేశీ మద్యం బాటిళ్లు లభించాయి. దీంతో, ఉదయ్ సిన్హాను ఎక్సైజ్ పోలీసులు రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. ఇది ఉదయ్ సిన్హాకు మరో చిక్కు అని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications